Bharateeyudu 2: గ్రాండ్‌గా ‘భారతీయుడు-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విచ్చేసిన సేనాపతి, తారాగణం
- హైదరాబాద్‌లోని ఎన్ కన్వె్షన్ సెంటర్‌లో 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్
- విచ్చేసిన లోకనాయకుడు కమల్‌హాసన్..తారాగణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu 2 Pre Release Event: లోకనాయకుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్‌లో విడుదల కానుంది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వె్షన్ సెంటర్‌లో ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎన్ కన్వెన్షన్‌లో భారతీయుడు 2 వేడుక ప్రారంభం అయ్యింది. ఈ వేడుకకు భారతీయుడు-2 తారాగణం విచ్చేసింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, యువ హీరో సిద్ధార్థ్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, బాబీ సింహా తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు. 28 ఏళ్ల ముందు కమల్, శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు-2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు.
Read Also: Praneeth Hanumanthu: తండ్రీ కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడిపై కేసు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పీ, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, భారతీయుడు-2 ఇంట్రో గ్లింప్స్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తు్న్నారు. ‘భారతీయుడు 2’ సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయటానికి సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?