Site icon NTV Telugu

Bradman Baggy Green: వేలంలో కోట్లు పలికిన బ్రాడ్‌మన్ ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్

Bradman Baggy Green

Bradman Baggy Green

Bradman Baggy Green: డాన్ బ్రాడ్‌మాన్.. ఈ గొప్ప క్రికెట్ ఆటగాడి గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు తరచుగా రికార్డ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో కనపడుతూ ఉంటుంది. ఇకపోతే, అతని పేరు మీద మరో రికార్డు నమోదైంది. ఎందుకంటే, అతని ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అత్యంత ఖరీదైన క్రికెట్ వస్తువులలో ఒకటిగా అమ్ముడబోయింది. ఈ టోపీ బ్రాడ్‌మాన్ ధరించిన ఏకైక ‘బ్యాగీ గ్రీన్’ అని సమాచారం. కాబట్టి, దీనికి అపారమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1947-48లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతను దానిని ధరించాడు.

Also Read: Triple Murder: దారుణం.. తెల్లారుజామున ఒకే ఇంట్లో ముగ్గురి కుటుంబసభ్యుల హత్య

బ్రాడ్‌మాన్ ‘బ్యాగీ గ్రీన్’ టెస్ట్ క్యాప్ 390,000 డాలర్స్ (రూ. 2.14 కోట్లు)కి విక్రయించబడింది. వేలం చార్జెస్ తో కలిపిన తర్వాత ఇది $479,700 (రూ. 2.63 కోట్లు)కి పెరిగింది. ఈ క్యాప్ ధరించి భారత్‌పై బ్యాట్‌తో బ్రాడ్‌మాన్ రికార్డ్స్ సృష్టించాడు. సొంతగడ్డపై తన చివరి టెస్టు సిరీస్‌లో అతను కేవలం ఆరు ఇన్నింగ్స్‌లలో 178.75 సగటుతో 715 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ కూడా కనిపించింది. ఈ వేలాన్ని నిర్వహించిన బోన్‌హామ్స్, టోపీని అరుదైన కళాఖండంగా వర్ణిస్తూ.. బ్రాడ్‌మాన్ విశిష్టమైన కెరీర్‌కు గుర్తుగా దీనిని అభివర్ణించాడు. స్పోర్ట్స్ నివేదికల ప్రకారం, బ్రాడ్‌మాన్ ఈ టోపీని భారత టూర్ మేనేజర్ పంకజ్ “పీటర్” కుమార్ గుప్తాకు బహుమతిగా అందజేశాడు. వేలం పాటలో కేవలం10 నిమిషాలకే ఈ టోపీపై బిడ్డింగ్ రూ.2 కోట్లు దాటింది.

Also Read: Netumbo Nandi Ndaithwa: చరిత్ర సృష్టించిన 72 ఏళ్ల నంది-న్డైత్వా.. నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక

Exit mobile version