Brad Haddin: అభిషేక్ శర్మ ఓ ‘రాస్కల్’.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brad Haddin: ముగిసిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఫామ్‌పై పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫైనల్ కు ముందు జరిగిన ఏడు మ్యాచ్ లలో అతను కేవలం 89 పరుగులే చేశాడు. ఇందులో గ్రూప్ దశలో వరుసగా మూడు సార్లు డక్ గా అవుట్ అయ్యి.. అవసరంలేని రికార్డ్ ను మూటగట్టుకున్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అభిషేక్ శర్మ తన నుండి రావాల్సిన ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడేసాడు. ఈ నేపథ్యంలో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
Sourav Ganguly: “ముందుంది ముసళ్ల పండుగ”.. విక్టరీ జోష్‌లో ఉన్న కోచ్ గంభీర్‌కు గంగూలీ హెచ్చరికలు..
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అభిషేక్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద మ్యాచ్ ల్లో అభిషేక్ అద్భుతంగా ఆడతాడని, సరదాగా అతన్ని “రాస్కల్” అని కూడా వ్యాఖ్యానించాడు. ఇంకా నాకు అభిషేక్ శర్మ అంటే చాలా ఇష్టమన్నారు. టోర్నీలో అతని స్థానంపై చాలా చర్చ జరిగింది. గ్రూప్ మ్యాచ్ ల్లో వరుసగా కొన్ని డ క్‌లు రావడంతో అతను ఒత్తిడిలో ఉన్నాడని అనిపించింది. కానీ, పెద్ద మ్యాచ్ ల్లో ఇలాంటి ఆటగాళ్లే అవసరమని.. వారు ఒత్తిడిని ఎదుర్కొని ప్రత్యర్థిపై ఒత్తిడి పెడతారని ఆయన తన భావనని వ్యక్త పరిచారు. ఫైనల్‌లో అతను ఆడిన తీరు మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిందని హాడిన్ ఓ క్రికెట్ పోడ్ కాస్ట్ లో అన్నారు.
US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..
అలాగే హాడిన్ న్యూజిలాండ్ జట్టును కూడా ప్రశంసించాడు. ఫైనల్‌కు చేరుకోవడం గొప్ప విషయమని అంటూనే.. కీలక సమయంలో మాత్రం వారు తడబడతారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ మరోసారి ఫైనల్‌కు చేరుకోవడం మంచి విషయం. ఫిన్ అలెన్, టిమ్ సెఫట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. టోర్నీలో ప్రతిదీ వారి వైపే ఉందనిపించింది. కానీ చివరి అడ్డంకిని దాటలేకపోయారని.. చివరికి మెరుగైన జట్టే గెలిచిందంటూ బ్రాడ్ హాడిన్ అన్నారు.
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..