Ambedkar Jayanti: భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేడ్కర్ గురించి 10 ఆసక్తికర విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambedkar Jayanti: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజును అంబేడ్కర్ జయంతి లేదా భీమ్ జయంతి అని కూడా అంటారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. ఆయన ఏప్రిల్ 14, 1891న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో దళిత మహర్ కుటుంబంలో జన్మించాడు. ఆయన ప్రపంచ స్థాయి న్యాయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్య్రం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన సహకారం అందించాడు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురించి 10 విషయాలు తెలుసుకుందాం.
Read Also: PM Modi: దేశ ప్రజలకు మోడీ గుడ్ న్యూస్..
Also Read
అంబేడ్కర్ గురించి 10 ఆసక్తికర విషయాలు
*1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీఆర్ అంబేడ్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. తన పదవీకాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
*1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ అంబేడ్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే.
*అంబేద్కర్ అసలు ఇంటిపేరు అంబవదేకర్ (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం ‘అంబవాడే’ పేరు నుండి వచ్చింది). అయితే, అతని గురువు మహదేవ్ అంబేడ్కర్ తన ఇంటిపేరును ‘అంబావ్డేకర్’ నుంచి ‘అంబేద్కర్’గా పాఠశాల రికార్డులలో మార్చాడు, ఎందుకంటే ఆయన తనను ఎంతగానో ప్రేమించాడు.
*అంబేడ్కర్ దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక పెద్ద మార్పులు చేశారు. దీని కింద 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పనివేళలను మార్చి 12 నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు.
*బాబా సాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు మాత్రమే కాదు, ఆయన ఎకనామిక్స్‌లో మొదటి పీహెచ్డీ, దక్షిణాసియాలో ఎకనామిక్స్‌లో మొదటి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. ఆయన తరంలో అత్యంత విద్యావంతులైన భారతీయులలో అంబేడ్కర్ కూడా ఉన్నారు.
* పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు కోసం ఆయన గట్టిగానే ఒత్తిడి తెచ్చారు. వివాహం, వారసత్వ విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
*కొలంబియా యూనివర్శిటీలో తన మూడేళ్లలో, అంబేడ్కర్ ఆర్థికశాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో ఆరు, ఫిలాసఫీలో ఐదు, హ్యుమానిటీస్‌లో నాలుగు, పాలిటిక్స్‌లో మూడు, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మన్లలో ఒక్కొక్కటి కోర్సులు అభ్యసించారు.
*తన పుస్తకంలో (1995లో ప్రచురితమైంది), థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్లో, అంబేడ్కర్ మధ్యప్రదేశ్, బీహార్లను విభజించాలని మొదట సూచించాడు. తరువాత, ఈ పుస్తకాన్ని వ్రాసిన దాదాపు 45 సంవత్సరాల తరువాత, చివరికి 2000 సంవత్సరంలో, బీహార్‌ను జార్ఖండ్ నుండి, ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ నుండి విభజించారు.
*డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులలో మాస్టర్. ఆయనకు హిందీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి 9 భాషల్లో పరిజ్ఞానం ఉంది. ఇది కాకుండా ఆయన సుమారు 21 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని మతాలను తులనాత్మక అధ్యయనం చేశాడు.
*బుద్ధ భగవానుని కళ్లతో చిత్రించిన మొదటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అంతకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా విగ్రహాలు కళ్లు మూసుకుని ఉండేవి.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!