NTV Telugu Site icon

Viral : స్కర్ట్స్ వేసుకుని ‘అబ్బా’యిలు.. వింతగా చూసిన అమ్మాయిలు

New Project (2)

New Project (2)

Viral : కొంతమంది వింత దుస్తులు ధరించి తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారు, వెళ్లేవారు ఇలాంటి దుస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటి మరొక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది, ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఢిల్లీ మెట్రోలో “డెనిమ్ స్కర్ట్స్” ధరించి తిరుగుతున్నారు. భవ్య కుమార్, సమీర్ ఖాన్ అనే యూజర్లు ఏప్రిల్ 16, 2023న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు. వారు పొడవాటి డెనిమ్ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు.

Read Also: Vande Bharat : త్వరలో పెరగనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ భోగీలు

వీరు ధరించిన దుస్తులు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఇద్దరు అబ్బాయిలు మెట్రో స్టేషన్‌కి వెళ్లడంతో వీడియో మొదలవుతుంది. వారిలో ఒకరు పొడవాటి డెనిమ్ స్కర్ట్ ధరించారు. అంతే కాదు నల్ల కళ్లద్దాలు, నీలిరంగు టీ షర్ట్ కూడా ధరించారు. ఐతే అతనితో పాటు నడిచే కుర్రాడు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు. వారు మెట్రోలోకి వెళ్లి ప్రయాణీకుల మధ్య నిల్చున్నారు. అందరి దృష్టి వారిపైనే. వారు వేసుకున్న డ్రస్ గురించే చర్చ. ఇక్కడ తమాషా ఏంటంటే ప్రజల మాటలు కెమెరాకు చిక్కాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: IPL 2023: చెన్నైకి గుడ్‌ న్యూస్‌!.. ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్

మెట్రోలో ఉండగా కొందరు ప్రయాణికుల స్పందనలను కూడా చూపించారు. ఈ వీడియోకు 18 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది ఈ వీడియో చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇది స్కర్ట్ కాదు.. డెనిమ్ లుంగీ అంటూ కామెంట్ పెట్టాడు.