NTV Telugu Site icon

Boyfriend threats: నీ కూతురినిచ్చి పెళ్లి చేయండి.. లేదంటే చంపేస్తానంటూ ప్రియుడు సూసైడ్

Up

Up

వన్ సైడ్ లవ్ చేసే ప్రేమికులు.. అమ్మాయి ప్రేమించలేదన్న బాధతో ఎంతటి క్రూరత్వానికైనా పాల్పడుతారు. అసరమైతే.. చంపడం లేదంటే చావడం. యూపీలోని కాన్పూర్ లో ఓ ప్రేమికుడు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రేమికుడు.. తన ప్రియురాలి కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నీ కూతురిని తనకిచ్చి పెళ్లి చేయాలని.. లేదంటే రక్తం కళ్ల చూడాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా.. ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే, అక్కడికెళ్లి తీసుకొస్తానని చెప్పాడు. అందుకే ఎవరితోనూ పెళ్లి చేయకని సూచించాడు. ఇలా మాట్లాడిన తర్వాత.. ఆ పిచ్చి ప్రేమికుడు తనతో తీసుకొచ్చుకున్న కత్తితో తనను తాను కోసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

సుశాంత్ సింగ్ మరణించిన ‘దెయ్యం బంగ్లా’లో అదా శర్మ.. షాకింగ్ కామెంట్స్?

ఈ ఘటన ఫీల్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన శివం కశ్యప్ తనను వేధిస్తున్నాడని అతని కూతురు చెబుతుంది. కాగా.. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నిందితుడు మార్గమధ్యలో ప్రేమలేఖ ఇచ్చాడు. ఆ తర్వాత.. అతని వేధింపుల వల్ల ఆ బాలిక మొత్తానికే కాలేజ్ మానేసింది. అయితే.. ఒకరోజు నిందితుడు శివం ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం మత్తులో ఉన్న శివం తన కూతురికి పెళ్లి చేయాలని.. తనను తీసుకెళ్లిపోతానని బెదిరించాడు. కాగా.. ఈ విషయంపై బాధిత కుటుంబీకులు శివమ్‌కు ఎంత చెప్పినా వినలేదు.

Saripodhaa Sanivaaram: రచ్చ రేపేలా ‘సరిపోదా శనివారం’.. ట్రైలర్ అదిరింది బాసూ!!

ఆ తర్వాత కత్తితో బెదిరించి గాయపర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా.. కొడుకు గాయపడటాన్ని చూసిన యువకుడి తల్లి బాలిక ఇంటికి వచ్చింది. కోపంతో వారిని ప్రశ్నించగా.. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని పిచ్చి వాగుడు వాగి కత్తితో గాయపరుచుకున్నాడని తండ్రి చెప్పాడు. అనంతరం.. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పుడు బాలికను ఆ యువకుడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని చెప్పారి బాధితురాలు చెప్పింది. ఈ క్రమంలో పోలీసులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును ఈస్ట్ డీసీపీ ఏడీసీపీకి అప్పగించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టు ముందుంచనున్నట్లు ఏడీసీపీ తెలిపారు.

Show comments