ప్రేమ పేరుతో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఇంతలో ప్రియురాలు ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే…..
Read Also: Spain: రవాణా రంగంలో అద్భుతం.. దేశంలో డ్రైవర్ రహిత మినీ బస్సు పరుగులు..
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెళ్లి పేరుతో మోసగించిన ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయించింది. బోరబండకి చెందిన ఓ యువతికి డ్రైవర్ రాకేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో.. పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత.. నీ కులాన్ని తమ ఇంట్లో అంగీకరించరని, తొలుత ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని.. నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని ప్రియుడు రాకేష్ నమ్మించాడు.
Read Also: Tirumala: ఆటోవాలలతో శ్రీవారి భక్తులకు తప్పని తిప్పలు!
అయితే.. ఆర్థిక సమస్యలతో ఉద్యోగం కోసం యువతి ఖతర్ వెళ్లింది. ఇదే సమయంలో గత నెల మరో యువతితో రాకేష్‌కి నిశ్చితార్ధం అయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు గత నెల 18న ఖతార్ నుంచి బోరబండకు వచ్చింది. ప్రేమ వ్యవహారంపై మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు రాకేష్ మరోసారి నమ్మించాడు. మళ్లీ ఖతర్ వెళ్లమని, రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో యువతి ఖతర్ వెళ్ళిపోయింది. కాగా..ఈ నెల 12న రాకేష్ పెళ్లి అని తెలిసి ఖతర్ నుంచి వచ్చి నేరుగా రాకేష్ ఇంటికి వెళ్లింది ప్రియురాలు. దీంతో..
రాకేష్ కుటుంబ సభ్యులు అడ్డుకుని యువతిపై దాడికి యత్నించారు. దీంతో.. యువతి బోరబండ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు ప్రియుడు రాకేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.