Spain: రవాణా రంగంలో అద్భుతం.. దేశంలో డ్రైవర్ రహిత మినీ బస్సు పరుగులు..
- దేశంలో డ్రైవర్ రహిత మినీ బస్సు పరుగులు
- స్పెయిన్‌లోని బార్సిలోనా డౌన్‌టౌన్‌లో డ్రైవర్‌లేని మినీబస్సులను విజయవంతంగా పరీక్షించారు
- ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి రీఛార్జ్ చేయడం ద్వారా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పుడు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఏకంగా డ్రైవర్ రహిత బస్సులు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండానే రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అయితే ఇది మనదేశంలో కాదండోయ్.. స్పెయిన్ లో అందుబాటులోకి వచ్చాయి. స్పెయిన్‌లోని బార్సిలోనా డౌన్‌టౌన్‌లో డ్రైవర్‌లేని మినీబస్సులను విజయవంతంగా పరీక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
Also Read:Tirumala: ఆటోవాలలతో శ్రీవారి భక్తులకు తప్పని తిప్పలు!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
బస్సు ప్రయాణికులతో స్టాప్ నుంచి బయలుదేరి, లేన్ మారే ముందు బ్రేక్ వేసి నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించింది. ఈ పరీక్షను రెనాల్ట్ నిర్వహించింది. ఈ బస్సు నాలుగు స్టాపులతో 2.2 కి.మీ దూరం ప్రయాణించింది. ఈ ప్రోటోటైప్ మినీబస్సు కోసం ఫ్రెంచ్ కార్ల తయారీదారు WeRide కంపెనీతో జతకట్టింది.గత సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ వేదిక వద్ద డ్రైవర్‌లెస్ బస్సును ఆవిష్కరించారు. ఇప్పుడు బార్సిలోనాలోని ఒక ప్రధాన రహదారిపై దీనిని పరీక్షించారు.
Also Read:Sleeping Problems : ప్రెగ్నెన్సీ లో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..!
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టోక్యో వరకు ఇతర నగరాల్లో కూడా కంపెనీలు డ్రైవర్‌లెస్ టాక్సీలు, బస్సులను పరీక్షిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి రీఛార్జ్ చేయడం ద్వారా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. డ్రైవర్ రహిత మినీ బస్సుకు 10 కెమెరాలు, ఎనిమిది లైడార్లు (సెన్సార్ శ్రేణులు) అమర్చారు. ఇవి కార్లు, మోటార్ సైకిళ్ళు, పాదచారులతో నిండిన వీధులను నావిగేట్ చేయడానికి సహాయపడతాయి. బార్సిలోనా వంటి రద్దీగా ఉండే నగరం గుండా ఇచ్చిన మార్గంలో బస్సు సురక్షితంగా ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!