Site icon NTV Telugu

Energetic Star Ram: యాక్షన్ ఎపిసోడ్‌తో బోయపాటి, రామ్ సినిమా షూటింగ్ ఆరంభం

Boyapati Srinu

Boyapati Srinu

Energetic Star Ram: బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా సినిమా రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. తమన్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘బోయపాటి శ్రీను అఖండ విజయం తర్వాత చేస్తున్న చిత్రమిది. ఆ సినిమాకు రోరింగ్ రీ రికార్డింగ్ అందించిన తమన్ మా సినిమాకూ సంగీతం అందిస్తున్నారు.

Nagababu: చిరుపై గరికపాటి ఫైర్.. అసూయ అంటూ నాగబాబు సెటైర్

బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. వాటికి తగ్గట్టు సినిమా ఉంటుంది. రామ్ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్యారెక్టర్‌ను బోయపాటి శ్రీను డిజైన్ చేశారు. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. స్టంట్ శివ నేతృత్వంలో ఆ యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నాం. సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఉన్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు.

రామ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ : తమ్మిరాజు, సినిమాటోగ్రఫీ: సంతోష్ డేటకీ, యాక్షన్: స్టంట్ శివ, సంగీతం: ఎస్. తమన్, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Exit mobile version