Site icon NTV Telugu

Boy Traced: కాలువలో పడిన బాలుడి ఆచూకీ లభ్యం..కానీ

Vja Boy1

Vja Boy1

విజయవాడ కాలువలో పడిన బాలూడి ఆచూకీ కథ విషాదంగా మిగిలింది. కాలువలో పడిన బాలుడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడు ఆచూకీ లభించింది. NAC కల్యాణమండపం వెనుక రోడ్ లో డ్రైన్ లో పడిపోయాడు అభిరామ్.. ఆయుష్ హాస్పటల్ సమీపంలో గుర్తించారు పోలీసులు..రెండున్నర కిలోమీటర్ల పాటు సైడు కాలువలో కొట్టుకువచ్చాడు అభిరామ్..బాలుడ్ని గుర్తించి హాస్పటల్ కి తరలించారు పోలీసులు..అయితే ఈ అన్వేషణ విషాదంగా ముగిసింది. డ్రైనేజీలో పడి రెస్క్యూ టీంకి దొరికినా.. కొన ఊపిరితో ఉన్నట్టు భావించి హాస్పటల్ కి తరలించారు పోలీసులు..అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు అభిరామ్. దీంతో అభిరామ్ కుటుంబంలో విషాదం నెలకొంది. అభిరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు పోలీసులు.

అసలేం జరిగిందంటే?

విజయవాడలోని గురునానక్ కాలనీలో గల డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు శుక్రవారం గల్లంతయిన సంగతి తెలిసిందే. బాలుడు అభిరామ్ కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలో వర్షం కురిసింది.. దీంతో గురునానక్ కాలనీలో డ్రైన్ లో వరద నీరు పోటెత్తింది. వర్షం తగ్గిన సమయలో డ్రైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడు అభిరామ్ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఆ సమయంలో డ్రైన్ లో వరద పోటెత్తింది. స్నేహితులు అభిరామ్ ను కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు కూడా డ్రైన్ లో కి దిగి అభిరామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా అభిరామ్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు సంఘలన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా అతని ఆచూకీ లభించింది. రో వైపు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ కార్పోరేషన్ నిర్లక్ష్యం కారణంగానే డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు కొట్టుకుపోయాడని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆరోపించారు. బాలుడి మృతిపై విపక్షాలు మండిపడుతున్నాయి.

Read Also:Ravindar Singh : అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది

Exit mobile version