Site icon NTV Telugu

Ghaziabad: ఈ పిల్లలున్నారే.. కోతి చేష్టలు చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు.. చివరకు

Ghaziabad

Ghaziabad

పెద్దల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు లిఫ్టుల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ అదే ఏమరపాటుగా ఉంటున్నారు. పిల్లలు తెలిసి తెలియక లిఫ్ట్ ఎక్కి ఆ తర్వాత కదులుతున్న సమయంలో డోర్స్ ఓపెన్ చేస్తూ తుంటరి పనులు చేస్తుండడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో మైనర్ బాలుడు లిఫ్ట్ తలుపు తెరిచి దానిలో చిక్కుకున్నాడు. చాలాసేపటి తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Also Read:TDP Mahanadu 2025: రెండు గంటల్లో టీడీపీకి రూ.17 కోట్ల విరాళాలు.. ఏం చేస్తారంటే..?

సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన సిసిటివి వీడియోలో.. పిల్లవాడు లిఫ్ట్ కదులుతున్నప్పుడు బలవంతంగా తలుపు తెరిచాడు. దీనివల్ల లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. లిఫ్ట్ కదలకపోవడంతో, ఆ పిల్లవాడు భయాందోళనకు గురై సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. చాలాసేపు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయి రక్షించండి అంటూ ఏడుస్తూ ఉండిపోయాడు. చివరికి ఒక టెక్నీషియన్ వచ్చిన తర్వాత అతన్ని సురక్షితంగా రక్షించారు. లిఫ్ట్‌లో ఎటువంటి టెక్నికల్ లోపం లేదని, ఆ పిల్లవాడు లిఫ్ట్ తలుపులు తెరవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సొసైటీ అధికారులు తెలిపారు. బాలుడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని.. లిఫ్ట్ ఆపరేటర్ ను నియమించుకోవాలని పోలీసులు సూచించారు.

Exit mobile version