Site icon NTV Telugu

Viral: చిరుత పిల్లతో ఆడుకుంటున్న పిల్లాడు.. అది పిల్లి కాదు పులి అంటున్న నెటిజన్స్..

Chirutha

Chirutha

అడవిలో నివసించే జంతువుల దగ్గరకి వెళ్లేందుకు మనం భయపడుతాం.. అవి మన జోలికి రాకపోయినా.. వాటిని చూస్తే చాలు వీలైనంత దూరం పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం.. అయితే.. ఎంతటి క్రూరజంతువైనా సరే తమ జోలికి రానంత వరకూ.. లేదా తమకి ఆకలి వేయనంత వరకూ ఎవరిని ఏం చేయవు.. అంతేకాదు తమకు మానవులుగానీ, ఇతర జంతువులు గానీ హాని తలపెడితే మాత్రం వాటి అంతు చూసే వరకూ కృరజంవుతువులు వదిలిపెట్టవు. ఇక పులి, చిరుతపులి, సింహంలాంటి జంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులతో అరణ్య వాసాల నుంచి కౄర మృగాలు అప్పుడప్పుడు జనారణ్యంలోకి వస్తూ ఉంటాయి.

Read Also: Bihar: పానీపూరి కోసం వెళ్లిన టీచ‌ర్ కాల్చివేత‌

తాజాగా.. ఒక చిరుత పులి పిల్ల దారి తప్పి ఎలా వచ్చింది ఏమోగానీ.. ఒక బాలుడు అది పిల్లి పిల్ల అన్నట్లు చిరుతపులి పిల్లతో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అందరూ షాక్ కి గురైతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీ రాష్ట్రం మీరట్‌లోని షాజన్‌పూర్‌లో ఓ మామిడి తోటలో ఓ పదేళ్లబాలుడు పెంపుడు కుక్కతో ఆడుకున్నట్లు చిరుత పిల్లతో ఆటలాడుతున్నాడు. ఆ చిరుత కూన మెడలో తాడు కట్టి ఉంది.. ఆ కూన మామిడిచెట్టు కింద ఉండగా బాలుడు దాన్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

Read Also: PM Modi US Visit: మోడీ అమెరికా పర్యటనను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ కుట్ర.. టూల్ కిట్‌తో ఐఎస్ఐ ప్లాన్

ఆ చిరుత కూన బాలుడి నుంచి తప్పించుకుంటూ అటు ఇటు పరుగులు పెడుతుంది. ఇది గమనించిన మామిడితోట యజమాని ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చాడు. వెంటనే స్పందించిన అటవీ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కూనను స్వాధీనం చేసుకున్నారు. పిల్లాడు, చిరుత కూనతో ఆడుకుంటున్న సమయంలో ఎవరు వీడియో తీశారనేది స్పష్టం కాలేదు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అసలు మామిడి తోటలోకి చిరుత పులి పిల్ల ఎలా వచ్చింది. ఆ బాలుడు అంత ధైర్యంగా ఆ పులిపట్టుకుంటున్నాడంటే పక్కన ఎవరో పెద్దవాళ్లు ఉండే ఉంటారని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా వీడు పిల్లాడిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక అక్కడికి చిరుత పిల్ల ఎలా వచ్చింది అనే విషయంపై అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version