దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. చిన్నారులకు ఎక్కడలేని ఉత్సాహంతో కేరింతలు వేస్తారు. దీపావళి పర్వదినాన ఎంతో ఆనందంగా పూజలు నిర్వహించి టపాసులు పేల్చుతుంటారు. అయితే.. ఇదే దీపావళి పండుగ వారి ఇంట్లో విషాదం నింపింది. టపాసులే యమపాశమై వారి 11 ఏళ్ల బాలుడిని ఆనంతలోకాలకు తీసుకుపోయాయి. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి టపాసులు కాలుస్తూ డబీన్‌మిట్టన్ కాలనీకి చెందిన లక్ష్మీనరసింహ (11 ) అనే బాలుడు మృతిచెందాడు.
Also Read : Karnataka: మంత్రా మజాకా… దీపావళికి గిఫ్ట్‌గా బంగారమా..!
పెద్దలు దగ్గరలేని సమయంలో టపాసులు కాలుస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. టపాసులు అన్నీ అంటుకొని ఒక్కసారి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఓ బైక్‌కు కూడా దగ్దమైంది. అయితే.. బాలుడు కేకలు వేయడంతో.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన లక్ష్మీనరసింహను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని గుంటూరు తరలించారు. అయితే.. మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
