NTV Telugu Site icon

Kurnool: వివాహేతర సంబంధం.. ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య!

Kurnool

Kurnool

Kurnool: ఏపీలోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కర్నూల్‌ నగరంలో ఓ ప్రైవేట్‌ లాడ్జిలో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందగిన విజయ్, రుక్సానాలుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరులోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయ్‌, రుక్సానాల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో గదిని వీరు అద్దెకు తీసుకున్నారు. కాగా శనివారం ఉదయం వరకు వీరు గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానంతో తలుపులు బద్దలు కొట్టారు.

Read Also: Hyderabad: జీడిమెట్లలో భారీగా గంజాయి స్వాధీనం..

గదిలోలో రుక్సానా, విజయ్‌లు రక్తపుమడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో విజయ్‌, రుక్సానాను కత్తితో పొడిచి హత్యచేసి, ఆ తర్వాత అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సంఘటన వద్ద పరిస్థితిని బట్టి ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రుక్సానాకు వివాహం అయ్యి ఓ కొడుకు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. హత్యలకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియదని అన్నారు. మృతురాలి కొడుకుకు తాము లాడ్జ్ లో ఉన్నామని రమ్మంటూ ఫోన్ వచ్చింది. దీంతో అక్కడికి అతను వచ్చేసరికి ఈ విషయం తెలిసింది. విజయ్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ పనిచేస్తున్నట్లు తెలిసింది. అన్ని కోణాల్లో కేసును నగర మూడో పట్టణ పోలీసులు విచారిస్తున్నట్లు సీఐ మురళీధర్ రెడ్డి వెల్లడించారు.