Kurnool: వివాహేతర సంబంధం.. ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: ఏపీలోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కర్నూల్ నగరంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందగిన విజయ్, రుక్సానాలుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరులోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయ్, రుక్సానాల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని వీరు అద్దెకు తీసుకున్నారు. కాగా శనివారం ఉదయం వరకు వీరు గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానంతో తలుపులు బద్దలు కొట్టారు.
Read Also: Hyderabad: జీడిమెట్లలో భారీగా గంజాయి స్వాధీనం..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
గదిలోలో రుక్సానా, విజయ్‌లు రక్తపుమడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో విజయ్, రుక్సానాను కత్తితో పొడిచి హత్యచేసి, ఆ తర్వాత అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సంఘటన వద్ద పరిస్థితిని బట్టి ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రుక్సానాకు వివాహం అయ్యి ఓ కొడుకు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. హత్యలకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియదని అన్నారు. మృతురాలి కొడుకుకు తాము లాడ్జ్ లో ఉన్నామని రమ్మంటూ ఫోన్ వచ్చింది. దీంతో అక్కడికి అతను వచ్చేసరికి ఈ విషయం తెలిసింది. విజయ్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ పనిచేస్తున్నట్లు తెలిసింది. అన్ని కోణాల్లో కేసును నగర మూడో పట్టణ పోలీసులు విచారిస్తున్నట్లు సీఐ మురళీధర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!