Site icon NTV Telugu

India China Row: గల్వాన్ మాదే.. ఘర్షణలకు భారతే కారణం..

India China

India China

భారత్‌తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్‌ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

Read Also: Nithiin: రాబిన్ హుడ్… ఐకానిక్ క్యారెక్టర్ అయ్యేలా ఉంది

ఇక, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లఘించి 2020లో వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యనించారు. ఇక, దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్‌ స్పందించారు. ఎల్‌ఏసీ వెంబడి తమ భూభాగం వైపే ఈ లోయ ఉందని చైనా చేస్తోన్న వాదనను డ్రాగన్ కంట్రీ రక్షణశాఖ ప్రతినిధి పునరుద్ఘాటించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత భారత్‌దేనని అతడు పేర్కొనడం గమనార్హం.

Read Also: K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం

అయితే, భారత్‌తో సరిహద్దు వివాదం వారసత్వంగా కొనసాగుతుందని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వు కియాన్‌ తెలిపారు. దానిని ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం సరైన పద్దతి కాదన్నారు. ఇరు దేశాల భాగస్వామ్య ప్రయోజనాలకు ఇది విరుద్ధంగా ఉంద అని పేర్కొన్నారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.. సరిహద్దు ప్రాంతంలో విబేధాలను పరిష్కరించేందుకు భారత్‌ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సరిహద్దు దగ్గర అసాధారణ పరిస్థితులు నెలకొన్నంత వరకు చైనాతో సాధారణ స్థితిని పునరుద్ధరించడం అసాధ్యమని భారత్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version