Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bottle Gourd Roti Recipe: ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సొరకాయ పేరు వింటేనే ఇంట్లో చాలామంది ముఖం చాటేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరూ కూర లేదా పప్పు రూపంలో దీన్ని తినేందుకు ఇష్టపడరు. అలాంటి వాళ్ల కోసం ఎంతో రుచికరమైన, పోషకాలు నిండిన ఈ సొరకాయ వంటకాన్ని తయారు చేయొచ్చు. నిజానికి దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే, పిల్లలు ఎలాంటి పేచీలు పెట్టకుండా ఇష్టంగా తింటారు. ఇది ఉదయం అల్పాహారానికైనా, రాత్రి డిన్నర్‌కైనా ఓ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ ఆప్షన్. తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
Also Read
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ "దద్దోజనం" కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
తాజా సొరకాయ (తురుముకున్నది)
2 కప్పుల గోధుమ పిండి
అర టీస్పూన్ వాము, జీలకర్ర
అర టీస్పూన్ పసుపు, కారం
అర టీస్పూన్ గరం మసాలా, ఇంగువ
2 నుంచి 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర
తగినంత ఉప్పు, 1 టేస్పూన్ నెయ్యి లేదా నూనె (పిండి కలపడానికి)
కాల్చుకోవడానికి తగినంత నెయ్యి లేదా వెన్న
తయారీ విధానం:
ముందుగా సొరకాయ పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి. ఆ తురుములో కొద్దిగా ఉప్పు కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దాంతో అందులోని అదనపు నీరంతా బయటకు వస్తుంది. ఆ నీటిని పారేయకుండా, పిండి కలుపుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నెలో గోధుమ పిండి, నీరు పిండేసిన సొరకాయ తురుము, వాము, జీలకర్ర, మసాలా దినుసులు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న సొరకాయ నీటితోనే పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి అద్దుకుంటూ సాధారణ రోటీలా లేదా కొద్దిగా మందంగా పూరీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక.. ఒత్తుకున్న పూరీని దానిపై వేయాలి. రెండు వైపులా సరిగ్గా కాలిన తర్వాత నెయ్యి లేదా వెన్న రాసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా చేస్తే ఎంతో మృదువైన, రుచికరమైన, పోషకాలు నిండిన సొరకాయ పూరీలు రెడీ అయిపోతాయి. వీటిని పెరుగుతో, ఊరగాయతో లేదా మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు..
తాజావార్తలు
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
-
AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’!
-
Minister Seethakka : అడవిలో చెట్లు లేకున్నా అడ్డంకులా? అధికారులపై సీతక్క ఫైర్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!