ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు తెచ్చుకున్న విద్యార్ధులకు అవార్డులు ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పాఠశాలల్లో సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. మెరుగైన విద్యార్ధులుగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో నిలబడేలా చేస్తున్నాం. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను ప్రోత్సాహించేలా ఈనెల 23న నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి అవార్డులు ఇస్తాం అన్నారు. ఈ నెల 27న జిల్లా స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన10th, inter విద్యార్ధులకు అవార్డులు అందిస్తామన్నారు.
Read Also:Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలోకి అడుగు పెట్టాలంటే అంత ఈజీ కాదు..!
ఈనెల 31న రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులను సత్కరించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే రోజు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరిస్తాం. సుమారు 2831 మందిని సత్కరించనున్నాం అని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్ధాయిలో సత్కారం పొందేవారికి పతకం, మెరిట్ సర్టిఫికేట్ అందిస్తామన్నారు. జిల్లా స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధికి మొదటి స్ధానం 50వేలు, రెండవ స్ధానం 30వేలు, ౩వ స్ధానం 10వేలు నగదు బహుమానం అందిస్తామన్నారు.
రాష్ట్ర స్ధాయిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్ధికి మొదటి స్ధానం 1 లక్ష రూపాయలు, రెండవ స్ధానం 75వేలు, ౩వ స్ధానం 50వేలు నగదు బహుమానంగా ఇస్తామన్నారు. రాష్ట్ర స్ధాయి కార్యక్రమానికి సీఎం జగన్ ను ముఖ్య అతిథిగా పిలుస్తాం. ఇప్పుడు అవార్డులు తీసుకునే విద్యార్ధులను చూసి వచ్చే సంవత్సరం కూడా విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. ఇది ప్రోత్సహం తో కూడుకున్న పోటీ అన్నారు మంత్రి బొత్స.
Read Also: IRCTC Ticket Booking: గుడ్‌న్యూస్.. డబ్బులు లేకున్నా రైలు ప్రయాణం..