NTV Telugu Site icon

Botsa Satyanarayana: బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలి..

Botsa

Botsa

Botsa Satyanarayana: బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్‌లో ప్రస్తావించి ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటి వరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని.. రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హూదూద్ తుఫాన్ తర్వాత వైజాగ్ ల్యాండ్ రికార్డులపై అనేక ఆరోపణలు వచ్చాయని.. 2004నుంచి జరిగిన భూ అవకతవకలపై టీడీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. వైసీపీ హయాంలో వేసిన సిట్ నివేదిక కోసం ఒకటి రెండు సార్లు తాను ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదన్నారు. సిట్ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులు ఎవరో బయట పెట్టాలన్నారు.

Read Also: Deputy CM Pawan Kalyan: స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం

ప్రజలకు అపోహలు కలిగించే ప్రయత్నాలు ఆగాలని కోరుకుంటున్నామన్నారు. బీజెపీ అధ్యక్షురాలు, టీడీపీ స్నేహితులు సన్నిహితులకు చెందిన సంధ్యా ఆక్వా కంపెనీ దిగుమతి చేసిందని ఆరోపణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్‌పై సమగ్ర విచారణకు ప్రధాన మంత్రికి కూటమి ఎంపీలు లేఖ రాయాలని ఆయన కోరారు. 25 వేల కోట్ల డ్రగ్స్ వ్యవహరం విశాఖ ప్రతిష్టకు దెబ్బతీసేదన్నారు. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు. రెడ్‌ బుక్కో, బ్లూ బుక్కో, బ్లాక్‌ బుక్కో తర్వాత.. ముందు మీ చేతుల్లో ఉన్న బుక్కులు తెరిస్తే వైజాగ్ ల్యాండ్ స్కాంపై నిజాలు బయటకు వస్తాయన్నారు. 25వేల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చాయా… లేదా అనేది తేలాలన్నారు. రేపు వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. 45రోజుల పాలనలో జరిగిన హత్యలకు గురైన వాళ్ళ వివరాలను వెల్లడిస్తామన్నారు.

15వేల కోట్లు అప్పా, గ్రాంటా అనేది క్లారిటీ వుండాలని….మాకు తెలిసి అది అప్పు అంటూ మాజీ మంత్రి పేర్కొన్నారు. విభజన హామీల కింద రావాలిసిన నిధులే వచ్చాయని ముఖ్యమంత్రి చెప్పడం వెనుక చాలా అర్థం ఉందన్నారు. రాజకీయాలలో చాలా మందిని కలుస్తారు.. అంత మాత్రాన పార్టీలు విలీనం అయిపోతాయా అంటూ వ్యాఖ్యానించారు. టీచర్ల బదిలీలు అక్రమాలు ఆరోపణలపై మాజీ మంత్రి బొత్స స్పందించారు. స్కూళ్ళు ఓపెన్ అయిన తర్వాతే బదిలీలు అమలులోకి రావాలని స్వయంగా తానే నోట్ పెట్టానని తెలిపారు.