Botsa Satyanarayana: కొత్త ఇసుక విధానంలో లోపాలున్నాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరత, ధరలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఇబ్బందులన దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. ఉచిత ఇసుక అన్నప్పుడు సీవరేజ్ టాక్స్ అవసరం ఉండదన్నారు. ఉచిత ఇసుకకు వక్ర భాష్యం చెప్పే దోచుకుంటున్నారో బహిర్గతం అవ్వాలన్నారు. ఉచితం అన్నప్పుడు గతం కంటే తక్కువకు అమ్మాలో వద్దో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు గతం కంటే 3 వేల కంటే తక్కువకు అమ్మాలి కానీ ఎలా పెంచి అమ్ముతున్నారని ప్రశ్నించారు.
Read Also: Minister BC Janardhan Reddy: రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు
ప్రభుత్వం పరిపాలన ప్రారంభించడానికి నాలుగు నెలల సమయం పట్టిందన్నారు. ఈ క్రమంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ 25రకాల పనులు చేసేవాళ్ళ భవిష్యత్ అగమ్య గోచరంగా ఉందన్నారు. ఇసుక మూడు యూనిట్లు 9-10 వేల మధ్య ఇంటి గుమ్మంలోకి తెచ్చి ఇచ్చే వాళ్లు అని, గాజువాకలో అయితే 14-15వేలకు లభించేదని వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో ఇసుక విజయనగరంలో 17-18వేలు అయితే మధురవాడలో 19-20వేలకు, వైజాగ్‌లో అయితే 22వేల రూపాయలు పలుకుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. నిత్యావసరాల ధరలు 25 – 30 రూపాయలు కేజీ మీద పెరిగాయని పేర్కొన్నారు. ధరల నియంత్రణకు మార్కెటింగ్, సివిల్ సప్లైస్ మంత్రిత్వశాఖలు పని చేయాలన్నారు. దేశం అంతా ధరలు నియంత్రణ లేనప్పుడే ప్రభుత్వాల పని తనం తేలేదంటూ చెప్పుకొచ్చారు.
విశాఖకు డ్రగ్స్ దిగుమతుల కేసులో సీబీఐ చేపట్టిన దర్యాప్తు పురోగతి ఏమైందని ప్రశ్నించారు. ఈ కేసులో తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి, డీజీపీకి లేఖ రాస్తానన్నారు. స్టీల్ ప్లాంట్‌పై మా చిత్త శుద్ధి మాకు తెలుసన్నారు. కూటమి పార్టీలు ఎన్ని అనుకున్నా ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. సంధ్య ఆక్వా సంస్థకు వచ్చింది.. అది పురంధేశ్వరి బంధువులదని తేలిందన్నారు. మా ప్రభుత్వం అడ్డుపడిన కారణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నామని బొత్స పేర్కొన్నారు.