విశాఖ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ.. ప్రతీ ఇంటికి వెళుతున్నారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేనున్నాంటూ హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. అవంతి శ్రీనివాస్ తరుఫున బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి.. జగనన్న కావాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అందాలంటే.. అభివృద్ధి ప్రతి ప్రాంతంలో జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
Gautam Gambhir: మరోసారి సీరియసైన గౌతమ్ గంభీర్.. ఏకంగా అంపైర్ పైనే..
ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు రాకముందే వాలంటీర్లను తీసేశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు, కూటమిని బంగాళాఖాతంలో కలపవల్సిన సమయం వచ్చిందని తెలిపారు. అందరం సమాయత్తమై అలాంటి మాటలను నమ్మవద్దని సూచించారు. ఎన్నికల వేళ వారు చెప్పే మాటలను అసలు నమ్మవద్దని అన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా మంచి పని చేశారా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు ఇలాంటి రకరకాల మాయమాటలు చెప్పారని తెలిపారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాలని కోరారు.
Aa Okkati Adakku :‘పెళ్లి ఎప్పుడు?’, అని అడిగే వాళ్ళని కొత్త చట్టం పెట్టి లోపలేయించండి!
నిరంతరం మీకు అండగా ఉంటున్న అవంతి శ్రీనివాస్ కు ఈ ఎన్నికల్లో ఓటెయ్యాలని బొత్స ఝాన్సీ కోరారు. ఎప్పుడూ అండగా ఉంటూ, మీకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారని తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో తనను కూడా ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపించాలని.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు బొత్స ఝాన్సీ కోరారు.