NTV Telugu Site icon

IND vs AUS: నీకు అవసరమా?.. పాంటింగ్‌పై ఫైరైన ఆసీస్ మాజీ క్రికెటర్!

Ricky Ponting

Ricky Ponting

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ విమర్శలకు గురవుతున్నాడు. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరుచుకుపడగా.. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్‌ లీ కూడా పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్‌కు ముందు అపహాస్యంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదన్నాడు. ఆస్ట్రేలియా-భారత్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా ఉంటుందని తాను భావిస్తున్నా అని షేన్‌ లీ పేర్కొన్నాడు.

ఫాక్స్ క్రికెట్ పోడ్‌కాస్ట్ ‘ది ఫాలో ఆన్‌’లో షేన్‌ లీ మాట్లాడుతూ… ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సమయంలో రికీ పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు. ఒక్కసారి విరాట్ కుదురుకున్నాడంటే.. ఆస్ట్రేలియాకు మరోసారి చుక్కలు చూపిస్తాడు. టెస్ట్ సిరీస్ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నా. భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టుల్లోనే బాల్ టాంపరింగ్‌ వివాదం వచ్చింది. ఇప్పుడు కోహ్లీని ఉద్దేశించి పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆసీస్‌కు అద్భుత బౌలింగ్‌ ఎటాక్‌ ఉంది. కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, లైయన్ బాగా బౌలింగ్‌ చేస్తున్నారు’ అని అన్నాడు.

Also Read: Gold Rate Today: ఇది కదా ‘బంగారం’ లాంటి వార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్!

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 0-3తో కోల్పోయింది. కివీస్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన రోహిత్ సేన.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం అవుతుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆసీస్ చేరుకున్న భారత్.. ప్రాక్టీస్ కూడా ఆరంభించింది. గత రెండుసార్లు భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే.

Show comments