NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలంలో సరిహద్దు వివాదం.. ఆలయ, అటవీశాఖ అధికారుల వాగ్వాదం

Srisailam

Srisailam

Srisailam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో అటవీశాఖ సరిహద్దు వివాదం మొదలైంది.. క్షేత్రపరిధిలో టోల్‌గేట్‌ వద్ద సరిహద్దులు వేశారు అటవీశాఖ అధికారులు.. అయితే, వారితో వాగ్వాదానికి దిగారు దేవస్థానం అధికారులు.. మా హద్దులు మేం వేసుకోవడానికి మీకు చెప్పడమేంటంటూ పరస్పరం వాగ్వాదానికి దిగారు దేవస్థానం, అటవీశాఖ అధికారులు.. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భక్తులకు ఇబ్బందులు కలిగిస్తూ సరిహద్దులు వేస్తూ ఇష్టానుసారంగా చేయడంపై దేవస్థానం అధికారులు తీవ్రస్థాయిలో ఫారెస్ట్‌ సిబ్బందిపై మండిపడ్డారు.. అయితే, శ్రీశైలం పోలీసుల రంగప్రవేశంతో ఈ వ్యవహారం సర్దుమనిగింది.. పోలీసుల ఎంట్రీతో.. శ్రీశైల మల్లన్న దేవస్థానం-అటవీశాఖ సరిహద్దు వివాదం కాస్తా.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. కాగా, శ్రీశైలం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.. పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనానికి భక్తులు తరలివస్తుంటారు.. ఈ సమయంలో.. అటవీశాఖ అధికారులు-ఆలయ అధికారుల మధ్య వివాదం చర్చగా మారింది.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం అంబులెన్స్ పంపిన బీజేపీ నాయకుడు.. ఎందుకంటే..

Show comments