Site icon NTV Telugu

Telangana BJP : ఈనెల 12 నుంచి బీజేపీ ‘‘బూత్ సశక్తీకరణ్ అభియాన్’’

Bjp

Bjp

‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు దిగ్విజయవంతం కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే అంశంపై ద్రుష్టి సారించింది. అందులో భాగంగా ‘‘బూత్ సశక్తీకరణ్ అభియాన్’’ పేరిట ఈనెల 12 నుండి 20 వరకు పోలింగ్ బూత్ ల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నేడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ సశక్తీకరణ్ అభియాన్ పై సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలిచ్చారు.

Also Read : Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం ప్రజా సంగ్రామ యాత్ర, స్ట్రీట్ కార్నర్, ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమాల ద్వారా స్పష్టంగా వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ లవారీగా బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ఆయా బూత్ లలో పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న వారిని, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారిని అక్కున చేర్చుకోవాలని కోరారు. పోలింగ్ బూత్ లవారీగా పార్టీని అభివ్రుద్ధి చేసే అంశంపై కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు ఈనెల 4, 5, 6 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వర్క్ షాప్ లు నిర్వహించాలని, అట్లాగే 9, 10, 11 తేదీల్లో శక్తి కేంద్రాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

Also Read : Fruits And Vegetables Storage: ఈ ఐదు పండ్లను కూరగాయలను ఎప్పడూ కలిసి నిల్వ చేయకూడదు.. ఎందుకంటే..

Exit mobile version