Site icon NTV Telugu

Boora Narsaiah Goud : అధికారం అన్ని రోజులు మీకే ఉండదు

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud

మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నాడని, అధికారం అన్ని రోజులు మీకే ఉండదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లేస్తే హీరోలు.. లేదంటే జీరోలు అన్నారు. మీరు ఇప్పటికే అభద్రతా భావంలో ఉన్నారనేది అందరికీ తెలుసునని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో.. తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారని ఆయన అన్నారు. అందుకే రాత్రికి రాత్రి జీవోలు వస్తున్నాయని, భూములు కూడా కబ్జా చేస్తున్నారన్నారు.

Also Read : MLC Jeevan Reddy : సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన రూ.10 వేల నష్టపరిహారం ఎక్కడా..?

ఔరంగాబాద్ సభకు భారీగా యాడ్స్ ఇచ్చారని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు యాడ్స్ ఇస్తున్నాడన్నారు. ప్రజల సొమ్మును పంచుతున్నాడని, కేసీఆర్.. పొలిటికల్ విజయ్ మాల్యా లాగా తయారయ్యారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాయల తెలంగాణ అని ఒక ఏపీ నేత అంటున్నాడని, ఏపీలో ఓట్లు పొందాలని కేసీఆర్ చేస్తున్న మోసంలాగా అనిపిస్తోందన్నారు. తెలంగాణ తల్లికి మోసం చేశారు.. ఇప్పుడు తెలుగు తల్లికి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నిర్వహించేది ఆత్మీయ సమ్మేళనాలు కాదు.. ఆత్మ వంచన సభలు అని ఆయన మండిపడ్డారు.

Also Read : Waterfalls: ప్రపంచంలో అత్యంత అందమైన టాప్-10 జలపాతాలు

దేశంలోనే ఐటీ రంగంలో తెలంగాణ టాప్ అని గొప్పలు చెప్పారు. అవన్నీ అబద్ధమని ఆయన ఆరోపించారు. 4 లక్షల కోట్ల సాఫ్ట్ వేర్‌ ఎక్స్‌పోర్ట్‌ కర్ణాటక ముందు వరుసలో ఉందని, తెలంగాణ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. తెలంగాణలో కేవలం లక్ష కోట్ల ఎక్స్‌పోర్ట్‌తో మాత్రమే జరుగుతోందని, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉందన్నారు.

Exit mobile version