NTV Telugu Site icon

Boney Kapoor: శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ..

Boney

Boney

Boney Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆమె మరణించి దాదాపు ఐదేళ్లు కావొస్తున్నా కూడా ఆమె కుటుంబంతో పాటు ఆమె అభిమానుల దృష్టిలో జీవించే ఉంది. అందం అంటే శ్రీదేవి.. ఆర్జీవీ చెప్పినట్లుగా.. పులా రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు రంగరించి.. బ్రహ్మ కిందకు పంపినట్లు ఉండే అతిలోక సుందరి ఆమె. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన శ్రీదేవి.. చనిపోయే చివరి నిమిషం వరకు కూడా నటనలోనే ఉండాలని కోరుకుంది. బంధువుల పెళ్ళికి దుబాయ్ కు వెళ్లిన ఆమె బాత్ టబ్ లో కాలుజారిమృతిచెందింది. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో విమర్శలు.. అయినా శ్రీదేవి భర్త బోనీ కపూర్ తొణకలేదు .. బెణకలేదు. ఆమె అంటే అతనికి అంత ప్రాణం. భార్య పిల్లలు ఉండగానే.. శ్రీదేవిపై మనసు పడ్డ బోనీ.. అందరిని ఒప్పించి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి శ్రీదేవిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. భార్యాభర్తలమధ్య ఎలాంటి గొడవలు ఉంటాయో.. వీరి మధ్య కూడా అలాంటివే ఉండేవని తెలుస్తోంది. ఇక శ్రీదేవి మరణం తరువాత మొదటి సస్పెక్ట్ బోనీ కపూర్. ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో అవమానాలు.. మరెన్నో అనుమానాలా మధ్య బోనీ పోలీసుల ముందు కూర్చున్నాడు. శ్రీదేవి మరణించిన తరువాత ఏరోజు ఆమె మరణం గురించి బోనీ మాట్లాడలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భార్య మృతికి కారణం ఇదేనని తేల్చి చెప్పాడు.

Thalaivar170: దింపు.. దింపు.. స్టారలందరినీ నువ్వు కూడా దింపు

” శ్రీదేవికి నటన అంటే ఎంతో ఇష్టం. కెమెరా ముందు అందంగా కనిపించాలని ఆమె స్ట్రిక్ట్ డైట్ చేస్తూ ఉండేది. భోజనం లో ఉప్పు, కారం లేని వంటలు తినేది. దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది. లో-బీపీ సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ, శ్రీదేవి మాత్రం వినిపించుకోలేదు. అలానే మేము దుబాయ్ వెళ్ళాం. అక్కడకు వెళ్ళేటప్పుడు కూడా ఆమె అనారోగ్యంతోనే ఉంది. శ్రీదేవిని సహజమరణం కాదు. ప్రమాదవశాత్తు జరిగింది. పోలీసులు ఎన్నో ప్రశ్నలు వేశారు.. అవన్నీ నేను ఎంతో ఓపిగ్గా భరించాను. చివరికి లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారు. భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాల పరీక్షిస్తున్నట్లు చెప్పారు.. శ్రీదేవి మృతి తరువాత నాగార్జున కలిసి ఓదార్చాడు. ఆ సమయంలో ఆయన కూడా ఇదే విషయాన్నీ చెప్పాడు. సెట్ లో ఆమె రెండు మూడు సార్లు ఇలానే కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments