Bonda Uma: కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bonda Uma: ఎంపీ కేశినేని నానిపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. కేశినేని నాని ఆస్తులు.. అప్పల లెక్కలు మీడియాకు విడుదల చేసిన ఆయన.. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని పేర్కొన్నారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసేశారన్న ఆయన.. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటన్నారు. కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్.. బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేస్తారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజీలో ఉన్నాయన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు.. కేశినేని నాని బిల్డప్ బాబాయ్.. ఆంధ్రా అంబానీ అని చెప్పుకుంటూ.. టీడీపీలో చేరారు.. ఎంపీ టిక్కెట్ తీసుకున్నారు. ప్రజల కోసం.. పార్టీ కోసం పని చేస్తానంటే చంద్రబాబు కూడా కేశినేని నానిని నమ్మారు. ఆయనకు టిక్కెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర కూడా ఉంది.. కానీ, 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
Read Also: Dattajirao Gaekwad Dead: భారత క్రికెట్‌లో విషాదం.. మాజీ కెప్టెన్ కన్నుమూత!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కేశినేని నాని తరపున సుజనానే డబ్బు ఖర్చు పెట్టారు.. చంద్రబాబు దయతో గెలిచారని తెలిపారు బోండా ఉమ.. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కేశినేని నాని టిక్కెట్ తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో కేశినేని నానికి ఎంపీ టిక్కెట్ రావడానికి కారణం లోకేష్ అన్నారు. రెండు సార్లు పోటీ చేసిన కేశినేని నాని పార్టీకి రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. ఇక, 2014 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ. 37 కోట్లు.. అప్పులు రూ. 66 కోట్లు. 2019 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ. 66 కోట్లు.. అప్పులు రూ. 51 కోట్లు. 2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం 2014లోని ఆస్తులతో పోల్చుకుంటే కేశినేని నాని ఆస్తులు 100 శాతం మేర పెరిగాయి. 2014 కంటే 2019 అప్పులూ తగ్గాయి. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెరిగాయి.. అంటూ లెక్కలు బయటపెట్టారు. అప్పులు తగ్గాయి. రూ. 2 వేల కోట్లు ఆస్తులను కేశినేని నాని ఎప్పుడు అమ్ముకున్నాడు..? అని ప్రశ్నించారు. కేశినేని నాని సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని బస్సులను అమ్మేశారని శ్రీరాం ఫైనాన్స్ సంస్థ కేశినేని నానిపై కేసులు పెట్టారని తెలిపారు.
Read Also: JD Lakshmi Narayana: ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారాలి..!
ఇక, ఒక్క బస్సుకు పర్మిట్ తీసుకుని కేశినేని నాని తన ట్రావెల్సుకు చెందిన నాలుగు బస్సులను అక్రమంగా తిప్పేవారని విమర్శించారు బోండా ఉమ.. బాలసుబ్రమణ్యం విచారణ మొదలు పెట్టడంతో కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేశారు. తన పీకకు ఈ కేసు చుట్టుకుంటుందనే కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసేశారు. మాకు తెలియకుండానే కేశినేని నాని అనే స్కామర్‌కు అండగా నిలిచాం. కేశినేని నాని చేసిన స్కాముకు మేం సారీ చెప్పాల్సి వచ్చిందన్నారు. కేశినేని నాని వల్ల పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొంది. వైసీపీ సభలకు జనాన్ని సప్లై చేసే స్థాయికి కేశినేని నాని దిగజారిపోయాడని దుయ్యబట్టారు. వైసీపీలో కేశినేని నానికి ఎంపీ టిక్కెట్ లేదు. కేశినేని నాని ప్రైవేట్ హోటల్స్ లిమిటెడ్ పేరుతో అప్పులు తీసుకుని.. సంస్థ పేరు మార్చేశాడు. కేశినేని నాని ప్రైవేట్ హోటల్స్ లిమిటెడ్ పేరును ఒరేటా ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు మార్చి అప్పులు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. రేంజ్ రోవర్ కారు కిస్తీలు కట్టడం లేదు.. ఆ కారును దాచేశారు. అన్నం పెట్టిన ఇంటికి కేశినేని నాని సున్నం పూసే రకం అంటూ సంచలన ఆరోపణలు చేశారు బోండా ఉమామహేశ్వరరావు.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!