Site icon NTV Telugu

Bonda Uma: ఫేక్ పోస్టులతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది

Bonda Uma

Bonda Uma

సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులతో వైసీపీ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. టీడీపీ-జనసేన మధ్య వివాదాలు సృష్టించేందుకు ఫేక్ ప్రచారం చేస్తున్నారు.నిన్న బీజేపీ జాతీయ నాయకుడిపై జరిగిన దాడి వెనుక వైసిపి కిరాయి గుండాల హస్తం ఉంది. ఇప్పటికైనా బీజేపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను గమనించాలి.దేశంలోనే అద్భుత నగరం అమరావతి అని దాన్ని నీరుకార్చారని సాక్షాత్తూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల ఉద్యమం పై వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై మండిపడ్డారు.

Read Also: CM KCR: 14 మంది ప్రధానులు మారినా.. దేశ ప్రజల తలరాత మారలేదు

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని ఫూల్స్ చేస్తూనే ఉన్నాడు.98 శాతం హామీలను ఎక్కడ నెరవేర్చారో సమాధానం చెప్పాలి.నవరత్నాలలో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు.15 లక్షల మంది పేదలకు వివిధ కారణాలతో ఫించన్లు ఎగ్గొట్టారు.కరెంటు ఛార్జీలను పెంచి రూ. 57 వేల కోట్లు దండుకున్నారు.ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ ఖజానా ఒక్కటే నిండుగా ఉంది.ఉద్యోగులు డబ్బులు కూడా జగన్ లూటీ చేశారు.వైసీపీ ఎంపీలు 31 మంది ఢిల్లీలో పైరవీలు చేయడానికే ఉన్నారు.ఈ నాలుగేళ్లలో ఏపీలో ఐదు ఇళ్లు మాత్రమే కట్టారని పార్లమెంటు సాక్షిగా నిరూపితమైంది.సీఎం జగన్ ని గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు బోండా ఉమామహేశ్వరరావు.

Read Also: CM KCR: 14 మంది ప్రధానులు మారినా.. దేశ ప్రజల తలరాత మారలేదు

Exit mobile version