Site icon NTV Telugu

Bommireddy Raghavendra Reddy: నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌..! వైసీపీలో చేరనున్న సీనియర్‌ నేత..

Bommireddy Raghavendra Redd

Bommireddy Raghavendra Redd

Bommireddy Raghavendra Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. అయితే, ఇప్పుడు టీడీపీకి షాక్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అందులో భాగంగా త్వరలోనే ఆత్మకూరు టీడీపీ నేత, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి త్వరలోనే వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధం అవుతున్నారు.. బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో ఇప్పటికే చర్చలు జరిపారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి.. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బొమ్మారెడ్డి.. దీంతో, వైసీపీలోకి ఆహ్వానించారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అయితే, గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి.. వెంకటగిరి వైసీపీ టికెట్‌ రాకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆత్మకూరు టికెట్ ఆశించారు బొమ్మిరెడ్డి.. పార్టీ నుంచి టికెట్‌పై ఎలాంటి హామీ లభించక పోవడంతో.. మరోసారి వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, ఎమ్మెల్యే కావాలన్నదే ఏకైక లక్ష్యంతో బొమ్మిరెడ్డి ఉన్నారని.. దాని కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నా, పార్టీలు మార్చినా అవకాశం దక్కకపోవడంతో ఈసారి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, మొదట కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆయన.. ఆ తర్వాత వైసీపీలో చేరారు.. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు.. ఇప్పుడు మళ్లీ వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.. అందులో ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, మేక‌పాటి చంద్రశేఖర్‌ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ముగ్గురూ నెల్లూరు జిల్లాకు చెందినవారే ఉన్న విషయం విదితమే.

Exit mobile version