NTV Telugu Site icon

Bombay High Court: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేరం కాదు..!

Bombay High Court

Bombay High Court

కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది. తాజాగా ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకుంది. అనంతరం వాట్సాప్‌లో మెసేజ్ పంపింది. ఆ మహిళ తనకు వాట్సాప్‌లో కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీనిపై కోర్టుకు వెళ్లాడు. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పు విలువరించింది. ఈ మెసేజ్‌లో ఏమీ లేదని.. జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే అన్నారు. మహిళపై కేసును కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఆ మహిళ బహిరంగంగా ఎలాంటి కులం వ్యాఖ్య చేయలేదని పేర్కొన్నారు. వ్యక్తిని అవమానించలేదని.. ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదని తెలిపింది.

READ MORE: Bangladesh: ‘‘భారతీయ హిందువు మా దేశం ఎందుకు వచ్చావురా..?’’ యువకుడికి బంగ్లాదేశ్‌లో దాడి..

వాస్తవానికి.. ఈ కేసు నాగ్‌పూర్‌కు చెందినది. 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 28 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ మధ్యప్రదేశ్ వాసులు. ఇద్దరూ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంబంధాన్ని తమ కుటుంబాలకు తెలియకుండా దాచిపెట్టారు. అయితే ఆ వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని మహిళకు తెలియడంతో విడిపోయారు. దీంతో ఆమెకు వాళ్ల ఇంట్లో వాళ్లు సంబంధాలు చూశారు. ఈ సంబంధం ఆ యువకుడి కారణంగా చెడిపోయింది. దీంతో ఆమె ఓ మెసేజ్ పంపింది. దాని ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తండ్రిని కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా బాంబే కోర్టు తీర్పు వెలువరించింది.