ఢిల్లీలోని ఎయిమ్స్, అపోలో సహా పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, సర్ గంగారాం వంటి పెద్ద, ప్రఖ్యాత ఆసుపత్రులకు ఏకకాలంలో బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. 12:04 గంటలకు పేలుస్తామని ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ఈ బెదిరింపు ఇమెయిల్‌తో కలకలం రేగింది. ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకుముందు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలిసిందే. మంగళవారం ఢిల్లీలోని పలు ఆసుపత్రులను పేల్చివేస్తామని బెదిరింపు ఇమెయిల్‌లు రావడంతో, అధికారులు ఆసుపత్రి ప్రాంగణంలో సోదాలు ప్రారంభించారు. మధ్యాహ్నం 1:04 గంటలకు నంగ్లోయ్‌లోని ఆసుపత్రికి, 1:07 గంటలకు సెంట్రల్ చాణక్యపురిలోని ప్రైమస్ హాస్పిటల్ కి కాల్ కూడా వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారి తెలిపారు.
READ MORE: Maharashtra: థానేలో ఘోరం.. నర్సరీ బాలికలపై లైంగిక వేధింపులు.. స్థానికులు రైల్‌రోకో
ఈ రెండు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో, ఢిల్లీ ఎయిమ్స్, అపోలో హాస్పిటల్‌తో సహా ఇతర ఆసుపత్రులకు కూడా బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక దళం వాహనాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పూర్తి విచారణ జరుగుతోంది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
READ MORE:Badlapur: బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ స్వీపర్..పెద్దఎత్తున నిరసనలు..రైలు రోకో
