నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టర్ మెయిల్ కి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మధ్యాహ్నం 03:30 లకు కలెక్టరేట్ ని పేలుస్తామని బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబు బెదిరింపుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఫేక్ బెదిరింపు మెయిల్ అని కలెక్టర్ ఆఫీస్ ఈవో చంద్రశేఖర్ తేల్చారు. ముప్పల లక్ష్మీనారాయణ పేరుతో మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి మెయిల్లో అల్లాహు అక్బర్ అని పెట్టినట్లు తెలిపారు.