Site icon NTV Telugu

Eiffel Tower: ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్

Effil Tower

Effil Tower

ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను పేల్చేందుకు బాంబు అమర్చామని దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. సందర్శకులందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు, బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!

స్థానిక కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టవర్ నుంచి పర్యాటకులను క్లియర్ చేసినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు భారీగా వస్తుంటారు.

Doctor: విమానంలో పాడు పని.. అరెస్ట్ చేసిన పోలీసులు

కాగా, ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ నిర్మాణ పనులు 1887లో ప్రారంభమయ్యాయి. 1889 మార్చి 31న దీని నిర్మాణం పూర్తయ్యింది. ఆ ఏడాదిలో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ ఫెయిర్ సందర్భంగా ఈఫిల్‌ టవర్‌ను సుమారు 20 లక్షల మంది సందర్శించారు. గత ఏడాది 62 లక్షల మంది దీనిని చూసేందుకు అక్కడకు వెళ్లారు.

Exit mobile version