Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bomb Threat Jaipur Operation Sindoor

Bomb Threat : జైపూర్‌లో హైఅలర్ట్‌.. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంకు బాంబు బెదిరింపు

Published Date :May 8, 2025 , 1:52 pm
By Gogikar Sai Krishna
  • సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో బాంబు పెట్టినట్టు బెదిరింపులు
  • జైపూర్‌ స్టేడియం చుట్టుపక్కల భారీ మోహరించిన పోలీసులు
  • స్టేడియం లోపల నుంచి అందర్నీ బయటకు పంపించివేసిన పోలీసులు
Bomb Threat : జైపూర్‌లో హైఅలర్ట్‌.. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంకు బాంబు బెదిరింపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bomb Threat : ఆపరేషన్ సింధూర్’ విజయంతో దేశమంతా ఉత్సాహంగా ఉన్న వేళ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. సవాయ్ మాన్‌సింగ్ (SMS) స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలికి ఈ బెదిరింపు సందేశం మెయిల్ ద్వారా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో అందింది. “ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా మీ స్టేడియంలో బాంబు పేలుస్తాం” అంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటన, భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఒక రోజు తర్వాత చోటుచేసుకుంది.

Rishabh Pant : భాయ్.. డ్రెస్సింగ్ రూమ్ నిన్ను మిస్ అవుతుంది..!

Also Read

  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..

కేవలం 25 నిమిషాల వ్యవధిలో, భారత్ బాలాకోట్ తర్వాత అతిపెద్ద సరిహద్దు దాటి దాడులను నిర్వహించింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిగిన ఈ మెరుపు దాడుల్లో వైమానిక, నావికా , భూతల దళాలు పాల్గొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా చీకటిలో ఈ ఆపరేషన్ జరిగింది. అగ్రశ్రేణి వర్గాల సమాచారం ప్రకారం, నిషేధిత జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT) , హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఈ ఖచ్చితమైన దాడుల్లో హతమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ లక్ష్యాలను ఎంపిక చేశామని ప్రభుత్వం ఒక విలేకరుల సమావేశంలో తెలిపింది.

బెదిరింపు మెయిల్ రాగానే జైపూర్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. స్టేడియం లోపల ఉన్న వారందరినీ తక్షణమే బయటకు పంపించివేశారు. అంతేకాకుండా, స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌లు స్టేడియం లోపల , వెలుపల క్షుణ్ణంగా గాలిస్తున్నారు. నగరంలో భయాందోళనలు నెలకొన్నప్పటికీ, పోలీసులు ప్రజలకు ధైర్యం చెబుతూ భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయం తర్వాత దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

Missile Attack : అమృతసర్‌ లక్ష్యంగా పాక్‌ మిస్సెల్‌ అటాక్‌.. తిప్పికొట్టిన భారత్‌..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bomb Threat
  • india
  • Jaipur
  • Military Operations
  • Operation Sindoor

తాజావార్తలు

  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..

  • Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions