Bollywood : మలయాళ రీమేక్స్ మోజులో చేతులు కాల్చుకుంటున్న బాలీవుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఓ హిట్ సినిమాను ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా ఫైనాన్షియల్ డ్యామేజెస్ ఎక్కువ జరిగేవి కావు. కానీ ఓటీటీ డ్రాస్టిక్ ఛేంజస్ వల్ల రీమేక్ తీసుకునే రోజులు పోయాయి. కథను మార్చినా, ఇక్కడ నెగిటివిటీ తగ్గట్లు స్క్రీన్ ప్లే రాసుకుని తీసినా అదే రిజల్ట్. ఆల్రెడీ ఓటీటీలో చూసేసిన బొమ్మను ఖర్చు పెట్టి థియేటర్స్‌కు వెళ్లి సినిమాను చూడాలనుకోవడం లేదు ఆడియన్స్. వెరసీ రీమేక్ తీసినా నిర్మాతలకు మేకుల్లా మారుతున్నాయి. ఈ మధ్య మలయళ చిత్రాలను తీసి అలాగే చేతులు కాల్చుకుంది బాలీవుడ్.
Also Read : Tollywood : పవర్ ఫుల్ క్యారెక్టర్స్‌తో వస్తున్న సీనియర్ హీరోలు
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
గత ఏడాది బాలీవుడ్ రెండు మాలీవుడ్ రీమేక్స్ చేసి డిజాస్టర్స్ కొని తెచ్చుకుంది. అందులో ఒకటి షాహీద్ కపూర్, పూజా హెగ్డే నటించిన దేవా. 2013లో వచ్చిన మలయాళ ఫిల్మ్ ముంబయి పోలీస్‌ను ఇంకాస్త యాక్షన్ జోడించి ఆడియన్స్ ముందుకు తెచ్చారు. కట్ చేస్తే బొమ్మ బొక్క బోర్లా పడింది. ఇదే కాదు రొమన్ ఛామ్ మూవీని కప్కపీగా రీమేక్ చేస్తే సేమ్ రిజల్ట్ టేస్ట్ చేసింది. ఈ ఎక్స్‌పరిమెంట్స్ ఫెయిలైనా కూడా మరోసారి ప్రయోగాలకు రెడీ అవుతోంది బాలీవుడ్. మాలీవుడ్ దృశ్యం ఎన్ని సార్లు తీసినా.. ఎన్ని భాషల్లో తీసినా సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు దృశ్యం నుండి టూ మూవీస్ వచ్చాయి. మాలీవుడ్ కథనే మక్కీకి మక్కీకి దించితే ఆడియన్స్ చూశారు. ఇప్పుడు ఒకే కథతో సీజన్3 సిద్దం చేస్తున్నారు. ఓకే సారి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలతో మాలీవుడ్ దృశ్యం3 ముందు రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత హిందీ వర్షన్. ఇక తెలుగు పట్టాలెక్కలేదు. కానీ అజయ్ దేవగన్ మాత్రం రిస్క్ చేసి రీమేక్ వర్షన్ చేసేస్తున్నాడు. ఫీల్ గుడ్ మలయాళ లవ్ స్టోరీ ప్రేమలు కూడా బాలీవుడ్ బాట పట్టింది. స్కైఫోర్స్ హీరో, తారా సుతారియా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియా రీమేక్ వర్షన్ లో నటించబోతున్నాడట. సాజిద్ నడియాద్ వాలా మేనకోడలు ఆఫియా సయ్యాద్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు సమాచారం. నెక్ట్స్ వీక్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందట. 45 రోజుల పాటు ఢిల్లీలో షూట్ చేయబోతున్నారన్నది బీటౌన్ బజ్. రీమేక్స్ రిజల్ట్ తేడా వస్తున్నాయి అని తెలిసి కూడా మాలీవుడ్ కథలను అరువు తెచ్చుకుంటోంది నార్త్ బెల్ట్.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!