Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood Villains in Tollywood: ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రల కోసం బాలీవుడ్ యువ నటులు, హిందీ వెబ్ సిరీస్‌లలో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న వారిని సెలెక్ట్ చేయడం ట్రెండ్ అయ్యింది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే భారీ హైప్ మధ్య టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ యంగ్ విలన్లు.. తెరపై మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు.క్యాస్టింగ్ ప్రకటించినప్పుడు ఉన్న ఆసక్తి, ఆ తర్వాత కనిపించడం లేదు. ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’, ‘ఆదర్శ కుటుంబం’ వంటి సినిమాలు ఈ ట్రెండ్‌కు అద్దం పడుతున్నాయి. మరి టాలీవుడ్ లో తేలిపోయిన బాలీవుడ్ విలన్స్ గురించి తెలుసుకుందాం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ విలన్ గా నటించారు. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’లో మున్నా భయ్యాగా తన నటనతో దివ్యేందు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన తెలుగు సినిమాలో విలన్‌గా నటించడంపై మొదట్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో దివ్యేందు ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో కనిపించారు. జాన్వీ కపూర్ పాత్రను అవమానించే వ్యక్తిగా, రామ్ చరణ్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఆయన రోల్ డిజైన్ చేశారు. పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. ప్రమోషన్స్‌లో దివ్యేందు క్యాస్టింగ్ ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది.
Also Read
- Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
- CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
- MS Dhoni: '7' నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
- PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ‘కిల్’ అనే బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌లో తన క్రూరమైన నటనతో మెప్పించిన రాఘవ్ జుయల్.. ఈ సినిమాలో కీలక విలన్‌గా నటించారు. ఇందులో ఆయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా కనిపించారు. ప్రమోషన్లలో మేకర్స్ ఆయన పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో క్యూరియాసిటీ పెరగలేదు.
ఇదే తరహా పరిస్థితి ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలోనూ ఎదురైంది. ‘ధురంధర్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్‌బీర్ సంధు ఈ చిత్రంలో బందిపోటు పాత్రలో నటించారు. విలన్ పాత్రకు కావాల్సిన లుక్స్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ.. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో పాటు ఆయన పాత్ర కూడా ప్రేక్షకులపై పెద్దగా ముద్ర వేయలేకపోయింది.
ఇక ఇప్పుడు సినీ వర్గాల దృష్టంతా యువ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ్‌పై పడింది. ‘లాపతా లేడీస్’ చిత్రంతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్పర్శ్.. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. డిసెంబర్ 4, 2026న ‘వృషకర్మ’ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ యంగ్ విలన్లు టాలీవుడ్లో ఆశించిన ప్రభావం చూపలేకపోయిన నేపథ్యంలో.. స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా.. కేవలం ఇతర భాషల్లో ఉన్న క్రేజ్‌ను చూసి విలన్లుగా తీసుకోవడం కంటే, కథలో బలమైన ఎమోషన్, పాత్రకు సరైన వెయిట్ ఉన్నప్పుడే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనేది మరోసారి స్పష్టమవుతోంది. భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న వృషకర్మ థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
Bollywood Villains in Tollywood: టాలీవుడ్లో తేలిపోతున్న బాలీవుడ్ యంగ్ విలన్లు!
-
Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
-
Shashi Tharoor: 850 మంది ఎంపీలతో లోక్‌సభ నడుస్తుందా?.. చప్పట్లు కొట్టడానికే చాలామంది వస్తారు..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!