Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bollywood Underworld: బాలీవుడ్లో ఒకప్పుడు టెర్రర్ సృష్టించిన అండర్ వరల్డ్ రోజులు మళ్లీ వస్తున్నాయా? 1980, 90వ దశకాల్లో గ్యాంగ్స్టర్లు సినిమారంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని బెదిరింపులు, కాల్పులు, వసూళ్లతో ఎలా భయపెట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి భయాంకరమైన వాతావరణమే ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పుణ్యమా అని మళ్లీ ముంబైలో కనిపిస్తోంది. సెలబ్రిటీలు ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితి రావడం, ఇళ్లపై కాల్పులు జరగడం చూస్తుంటే బాలీవుడ్ మళ్లీ ఆ చీకటి రోజుల్లోకి వెళ్తోందా అనే అనుమానం కలుగుతోంది.
తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ చేరారు. అక్టోబర్ 18, ఆదివారం నాడు ముంబైలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ కారుపై కొందరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ప్రాణాలతో బయటపడ్డారు కానీ, ఆయన డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సల్మాన్ ఖాన్‌తో ఎవరూ పని చేయకూడదని హెచ్చరిస్తూ.. ఈ దాడికి తమదే బాధ్యత అని బిష్ణోయ్ గ్యాంగే స్వయంగా ప్రకటించుకుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఎనిమిది నెలల క్రితం ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కూడా ఇలాగే కాల్పులు జరగడం, రణ్వీర్ సింగ్‌కు ఎక్స్టార్షన్ బెదిరింపులు రావడం గమనిస్తే ఈ ముప్పు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే ఈ మొత్తం గొడవకు మూలం సల్మాన్ ఖానే అని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
- Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
- Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
- Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
అసలు ఏంటి ఈ గొడవ..?
1998 నాటి కృష్ణజంకల (బ్లాక్‌బక్) హత్యాకాండ కేసుతో మొదలైన లారెన్స్ బిష్ణోయ్ కక్షే సల్మాన్ ఖాన్‌ను నిత్యం టార్గెట్ చేస్తూ వస్తోంది. దీనికి కొనసాగింపుగా 2024 ఏప్రిల్‌లో సల్మాన్ బాంద్రాలోని నివాసం బయట బైక్‌లపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాదు, సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీమ్ ఖాన్ కూడా బెదిరింపులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ గ్యాంగ్ కేవలం సల్మాన్‌నే కాకుండా ఆయన సన్నిహితులను సైతం వదలడం లేదు. 2023 నవంబర్‌లో కెనడాలో పంజాబీ నటుడు-గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇల్లు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. సల్మాన్‌తో అతనికి ఉన్న పరిచయమే ఈ దాడికి కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయి. అయితే గిప్పీ గ్రేవాల్ మాత్రం తాను సల్మాన్‌కు అంత సన్నిహితుడిని కాదని తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.
అయితే, 2024 అక్టోబర్ 12న జరిగిన మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖీ హత్య ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిఖీని ముంబైలోనే దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్యకు కూడా బిష్ణోయ్ గ్యాంగే బాధ్యత వహించింది. సల్మాన్‌తో ఆయనకున్న స్నేహమే ఈ హత్యకు కారణమని ఆరోపించింది. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కేవలం బెదిరింపులతో ఆగిపోకుండా ప్రాణాలు తీసే వరకు వెళ్తారని తెలియడంతో సెలబ్రిటీల్లో భయం మరింత పెరిగింది. సల్మాన్ సర్కిల్లో ఉన్నవారే కాకుండా ఈ లిస్ట్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 2024 అక్టోబర్‌లో కమెడియన్ మునావర్ ఫరూఖీకి కూడా ప్రాణహాని బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. ఢిల్లీలో ఆయనను టార్గెట్ చేయడానికి ప్లాన్ జరుగుతోందని నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. ఇక కపిల్ శర్మ కెనడా కేఫ్‌పై 2025లో ఏకంగా మూడుసార్లు కాల్పులు జరిగాయి. ఈ కేఫ్ ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ హాజరు కావడమే ఈ దాడికి కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ లింక్ పెట్టింది.
ఈ ఏడాది అంటే 2026 జూలైలో ఆమిర్ ఖాన్‌ను కూడా ఈ బెదిరింపులు తాకాయి. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులమని చెప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా, ఆడియో మెసేజ్‌ల పంపారు. ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ కొందరు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే 2026 ఫిబ్రవరిలో నటుడు రణ్వీర్ సింగ్‌కు రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆయనతో పాటు ఆయన స్టాఫ్‌కు కూడా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇదే ఫిబ్రవరిలో సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. క్రిప్టోకరెన్సీ రూపంలో పెద్ద మొత్తంలో రన్సమ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఇక, 1990ల నాటి నేర చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి భయాలే అప్పట్లోనూ ఉండేవి. 1997లో మ్యూజిక్ బారన్ గుషన్ కుమార్ హత్య, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ముకేష్ దుగ్గల్ కాల్చివేత, 2000 సంవత్సరంలో డైరెక్టర్ రాకేష్ రోషన్ పై జరిగిన కాల్పుల ఘటనలు ఇండస్ట్రీని గడగడలాడించాయి. అప్పట్లో క్రిమినల్ నెట్‌వర్క్‌లు సినిమారంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ఇలాగే భయపెట్టేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి, టెక్నాలజీ పెరిగింది కానీ పద్ధతులు మాత్రం అవే ఉన్నాయి. డబ్బు డిమాండ్లు చేయడం, సెలబ్రిటీలను, వారి సన్నిహితులను హెచ్చరించడం, సినిమా రంగానికి మాత్రమే కాకుండా బయటి ప్రపంచానికి కూడా పెద్ద సందేశం ఇచ్చేలా ఇలాంటి కాల్పులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. టైగర్ ష్రాఫ్‌పై జరిగిన తాజా దాడి ఈ హింసాత్మక పరంపరలో మరో కలవరపెట్టే అధ్యాయం. తగినంత వనరులు, సెక్యూరిటీ, పరపతి ఉన్న బాలీవుడ్ ప్రముఖులే ఇలా వరుసగా బెదిరింపులను, దాడిలను ఎదుర్కోవాల్సి వస్తోందంటే, ఇది కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇదొక పెద్ద లా అండ్ ఆర్డర్ సవాల్. టైగర్ ష్రాఫ్ పై జరిగిన ఈ దాడితోనైనా ఈ సమస్యను ఇకపై తేలికగా తీసుకోవడానికి వీళ్లేదని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
-
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
-
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!