Site icon NTV Telugu

Arijith Singh : మ్యూజిక్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్!

Arijithsing

Arijithsing

అర్జిత్ సింగ్.. ఈ పేరు వింటే చాలు ఏదో తెలియని ఒక మాధుర్యం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన గొంతులో నుంచి పాట వచ్చిందంటే అది చార్ట్ బస్టర్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరి ఫోన్ సాంగ్ లిస్ట్ లో అరిజిత్ సాంగ్స్ ఉండాల్సిందే. అలాంటి క్రేజ్ ఉన్న ఈ స్టార్ సింగర్ ఇప్పుడు తన అభిమానులకు ఒక కోలుకోలేని వార్త చెప్పారు. ఇకపై తాను ప్లే-బ్యాక్ సింగింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్లు, తన వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.

Also Read : Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్

తన సోషల్ మీడియా వేదికగా అర్జిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇకపై నేను ప్లే-బ్యాక్ సింగర్‌గా పాటలు పాడను. ప్రస్తుతం నేను ఏ సినిమాలకైతే కమిట్ అయ్యానో, వాటికి మాత్రమే పాడతాను. ఆ తర్వాత నుంచి నా రిటైర్మెంట్ మొదలవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. అర్జిత్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అటు బాలీవుడ్‌లో, ఇటు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో అసలు ఇంత సడెన్‌గా అర్జిత్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? వ్యక్తిగత కారణాలా లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తన మెలోడీ పాటలతో ఇన్నాళ్లు ఊరటనిచ్చిన అరిజిత్ గొంతు ఇకపై వినిపించదు అనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనిపై అర్జిత్ పూర్తిస్థాయిలో స్పందిస్తారో లేదో చూడాలి.

Exit mobile version