Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్స్ అపాన్ ఏ టైమ్ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన సీనియర్ బాలీవుడ్ బ్యూటీస్, ఈ ఏడాది ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసపెట్టి తమ సినిమాలతో ఆడియన్స్‌కి ఫీస్ట్ ఇస్తున్నారు. ఎనిమిదేళ్లు బ్రేక్ తీసుకొని సొట్టబుగ్గల సుందరి కూడా రీఎంట్రీ తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఎవరు? 80స్, 90స్, 2000 తొలి దశకంలో బాలీవుడ్‌ను ఏలేసిన స్టార్ బ్యూటీస్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టేస్తున్నారు. స్టిల్ మెయిన్ లీడ్స్ ఆఫర్స్ కొల్లగొడుతూ ఆడియన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. అయితే ఈ మధ్య కొందరి ప్రెజెన్స్ మిస్ అయింది, కానీ ఈ ఏడాది కవర్ చేసేస్తున్నారు సీనియర్ భామలు.
‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ తర్వాత త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న రాణి ముఖర్జీ, ‘మర్దాని 3’తో హాయ్ చెప్పేసింది. ఈ ఏడాది చివరిలో షారుఖ్ ‘కింగ్’తో మరోసారి ఎంటర్టైన్ చేయబోతుంది. మరో సీనియర్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా ‘సుఖీ’ తర్వాత బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ సిరీస్ తర్వాత గ్యాప్ ఇచ్చిన ఈ పొడుగు కాళ్ళ సుందరి, కన్నడ డబ్బింగ్ ఫిలిం ‘కేడి: ద డెవిల్’తో హాయ్ చెప్పింది. ‘భూల్ భులయ్యా 3’ తర్వాత ‘మిస్టర్ పాండే’ వెబ్ సిరీస్ చేసిన డాన్స్ క్వీన్ మాధురి దీక్షిత్, ‘మా బెహన్’ అంటూ మరోసారి ఓటీటీకే పరిమితమైంది. టబు ‘భూత్ బంగ్లా’తో హిట్ కొట్టేసింది, సౌత్‌లోనూ సినిమాలు లోడింగ్ చేస్తోంది ఈ భామ.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరిష్మా, పర్సనల్ లైఫ్ కొలాప్స్ అయ్యాక ప్రొఫెషనల్ లైఫ్ సెట్ చేసుకునే పనిలో పడింది. ‘మర్డర్ ముబారక్’లో ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించిన కరిష్మా, తాజాగా ‘బ్రౌన్’ వెబ్ సిరీస్‌తో హాయ్ చెప్పేసింది. వీరితో పాటు మరో సీనియర్ బ్యూటీ ప్రీతి జింతా, ఎయిట్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ‘బట్వారా 1947’తో రీఎంట్రీ ఇస్తోంది. నిత్యం ఆడియన్స్‌తో టచ్‌లో ఉంటున్న కాజోల్, ‘మహారాగ్ని’ ప్రాజెక్ట్స్‌తో బిజీ. కానీ, ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో నో అప్డేట్.
ఇలా సీనియర్స్ అంతా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు, ఒక్క ఐశ్వర్యా రాయ్ తప్ప! మాధురి దీక్షిత్ నుంచి ప్రీతి జింతా వరకు సిల్వర్ స్క్రీన్ పైనో లేక డిజిటల్ ప్లాట్ఫామ్లోనో సినిమా, లేదా సిరీస్ రూపంలో ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మరి ఐశ్వర్యా రాయ్ సంగతి ఏంటి? ‘పొన్నియిన్ సెల్వన్ 2’ తర్వాత ఐషు ప్రెజెన్స్ మిస్ అయింది. కేన్స్ ఉత్సవాల్లో మెరవడం తప్ప కొత్త సినిమా కబురు వినిపించడం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ ఆడియన్స్‌తో టచ్ కోల్పోయి అప్పుడే త్రీ ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది. ‘పొన్నియిన్ సెల్వన్ 1 అండ్ 2’ చిత్రాల తర్వాత ఆమె కనిపించలేదు. చెప్పాలంటే అది కూడా తమిళ సినిమానే, హిందీలో ఎనిమిదేళ్ల నుండి ఐషు ప్రెజెన్స్ మిస్ అయింది. చివరిగా ‘ఫన్నీ ఖాన్’లో నటించింది బిగ్ బీ కోడలు.
ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో సందడి చేసింది ఐశ్వర్యా రాయ్. చివరి వరకు ఐషు కనిపిస్తుందా లేదా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చింది, స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌లో మెస్మరైజ్ చేసింది. రీసెంట్ టైమ్స్‌లో కాస్త బొద్దుగా మారిన ఐషు, కేన్స్ ఉత్సవాల్లో కాస్త నాజూగ్గా కనిపించింది. దీంతో మళ్ళీ యాక్టింగ్ పై ఫోకస్ చేస్తుందేమో అనుకున్నారు, కానీ కొత్త సినిమా కబురు చెప్పలేదు మాజీ మిస్ వరల్డ్. మరి ఈ ఏడాదైనా ఆమె నుండి న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వస్తుందో లేదో లెట్స్ సీ!
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!