Salman Khan in Vishakapatnam: బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విశాఖలో సందడి చేశాడు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాఖకు వచ్చిన హీరో సల్మాన్ ఖాన్.. షూటింగ్ విరామ సమయంలో నేవీ సిబ్బందితో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండియన్ నేవీ తూర్పు కమాండ్ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ డ్యాన్సులు వేశాడు. అనంతరం నేవీ సిబ్బందితో కలిసి కిచెన్‌లో వంట చేశాడు. అంతేకాకుండా మువ్వన్నెల జెండాను చేతబట్టుకుని నేవీ సిబ్బంది, వారి కుటుంబాలను ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Covid-19: ఫోర్త్ వేవ్ ఫీవర్.. అక్కడ ఫేస్‌మాస్క్‌లు ధరించకుంటే రూ.500 జరిమానా
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ విశాఖలోనూ నేవీ సిబ్బంది వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే విశాఖలోనే ఉన్న సల్మాన్ ఖాన్ ఈ విషయం తెలుసుకుని నేవీ సిబ్బందితో కలిసి సందడి చేశాడు. త్రివర్ణ పతాకం ఎగురవేసి అందరిలోనూ జోష్ నింపాడు. నేవీ క్యాప్ ధరించడమే కాకుండా డ్యాన్సులు వేశాడు. పుష్ అప్‌లు చేస్తూ జవాన్‌లలో ఉత్సాహం నింపాడు. నేవీ సిబ్బంది కూడా పుష్ అప్‌లు తీయాలంటూ పోటీలు నిర్వహించాడు. కాగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తమ వద్దకు వచ్చి సమయం కేటాయించి తమతో ఆడిపాడటం పట్ల నేవీ జవాన్లు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ తెల్లటి చొక్కా, నలుపు డెనిమ్ ప్యాంట్ ధరించి హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ కభీ ఈద్ కభీ దీపావళి, కిక్ 2, టైగర్ 3 మూవీలతో పాటు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.
