NTV Telugu Site icon

Akshay Kumar: ‘కన్నప్ప’ ను రెండు సార్లు తిరస్కరించా.. విష్ణు, మోహన్‌బాబు ఫోన్ చేసినా..

Akshay Kumar

Akshay Kumar

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘క‌న్నప్ప’. పాన్ ఇండియా సినిమా కన్నప్పలో విష్ణుతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే విష్ణు కుమార్తె, కుమారుడు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ శివుడి పాత్రంలో నటిస్తున్న విషయం విదితమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హిందీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు అక్షయ్‌కుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివుడి ప్రతిను గుర్తు చేసుకుంటే అక్షయ్ కుమార్ రూపమే గుర్తొస్తుందన్నారు.

READ MORE: DC: ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కెవిన్ పీటర్సన్..

ఈ సినిమా కోసం మోహన్‌లాల్‌, ప్రభాస్‌ అందరూ కష్ట పడి పని చేశారని విష్ణు కొనియాడారు. అందరూ వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశానని.. షూటింగ్ ప్రారంభం అయ్యాక తనలో ఎన్నో మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. కాగా.. ఈ ఈవెంట్‌లో శివుడి పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కన్నప్ప’ సినిమాను రెండు సార్లు తిరస్కరించినట్లు వెల్లడించారు. విష్ణు, మోహన్‌బాబు ఎన్ని సార్లు ఫోన్ చేసిన తన బిజీ షెడ్యూల్ వల్ల మాట్లాడటం కుదరల లేదుని తెలిపారు. వారు తన ఆఫీస్ కి వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే ఒప్పుకున్నట్లు చెప్పారు.

READ MORE: KTR : సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విమర్శల వర్షం