Sanjay Leela Bhansali on Heeramandi Season 2: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంజయ్ తన సినిమాల మాదిరిగానే.. ఈ వెబ్ సిరీస్‌ని కూడా చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, రిచా చద్దా కీలక పాత్రల్లో నటించిన హీరామండి.. అందరి ప్రశంసలు అందుకుంది. స్వాతంత్ర్యానికి ముందు లాహోర్‌లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని సంజయ్ రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ సంచలనం సృష్టించింది.
ముంబైలోని కార్టర్ రోడ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ హీరామండి సిరీస్‌కు సీజన్ 2ను ప్రకటించారు. అంతేకాదు సీజన్ 2 కథను కూడా చెప్పేశారు. ‘2022లో గంగూబాయి కాఠియావాడి పూర్తయినప్పటి నుంచి హీరామండి కోసం పనిచేయడం మొదలెట్టా. ఇది నా తొలి సిరీస్ కావడంతో కష్టంగా అనిపించింది. అయినా సరే బాధ్యతగా భావించి పనులు మొదలుపెట్టా. బ్రేక్ లేకుండా పని చేశాను. హీరామండి విజయం సాదించినందుకు సంతోషంగా ఉంది. మేం పార్టీ కూడా చేసుకున్నాం’ అని సంజయ్‌లీలా భన్సాలీ తెలిపారు.
Also Read: T20 World Cup 2024: తస్మాత్ జాగ్రత్త.. ఆటగాళ్లను హెచ్చరించిన రాహుల్ ద్రవిడ్!
‘హీరామండి 2లో వేశ్యలందరూ లాహోర్ వదిలి.. సినీ పరిశ్రమకు వస్తారు. దేశ విభజన సమయంలో వారు ముంబై, కోల్‌కతా వెళ్లి స్థిరపడతారు. అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారన్నది సీజన్ 2లో చూపిస్తా. సీజన్ 2లోనూ అందరూ డ్యాన్స్ చేస్తారు. అయితే సీజన్ 1లో నవాబుల కోసం డ్యాన్స్ చేసిన వారు.. రెండో సీజన్‌లో నిర్మాతల కోసం చేస్తారు.సీజన్ 2 కథ ఇదే. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి’ అని సంజయ్‌లీలా భన్సాలీ చెప్పుకొచ్చారు.