NTV Telugu Site icon

Santosham Film Awards: ‘సంతోషం’లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ

Urvasi

Urvasi

Santosham Film Awards: ఇరవై సంవత్సరాలుగా సినీ రంగంలో ఉత్తమ చిత్రాలను గుర్తించి పలు విభాగాల వారికి అవార్డులను అందజేస్తోంది సంతోషం సంస్థ. ప్రస్తుతం సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి సన్నద్ధమవుతోంది. కరోనా సమయంలో తప్పితే ప్రతేడాది సినీ పరిశ్రమలో ఉత్తమ విభాగాలను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నారు సురేష్ కొండేటి. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలు అన్నింటికి అవార్డులు ఇస్తూ వస్తున్నారు. సురేష్ కొండేటి ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డ్యాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం. సరిగ్గా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి ఆమె ఎవరు అనే విషయాన్ని రివీల్ చేసింది.

Read Also: Keerthy Suresh: కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్‏లో మహానటి.. మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్

ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఊర్వశితో ఈసారి సంతోషం ఫిలిం అవార్డ్స్ లో డ్యాన్స్ చేయబోతున్నారు. బాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ అంటూ సాగుతున్న ఫుల్ మాస్ సాంగ్ లో ఆమె కనిపిస్తోంది. అలాగే రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అయితే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకముందే సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఊర్వశి రౌతేలా. ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26న ఘనంగా జరగనుంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా సంతోషం సురేష్ అనేక రకాల కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు.