Sunny Leone: ఎంగేజ్మెంట్ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా మనసు ముక్కలు చేశాడు: సన్నీ లియోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Sunny Leone praises husband Daniel Weber: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన మనసు ముక్కలైన క్షణాలను గర్తుచేసుకున్నారు. తన మాజీ ప్రియుడు తనను మోసం చేశాడని తెలిపారు. ఓ వ్యక్తితో తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని, మరో రెండు నెలల్లో పెళ్లి అనగా తాను ఇష్టం లేదని చెప్పాడని సన్నీ పేర్కొన్నారు. తన మనసు ముక్కలైన సమయంలో దేవుడు డేనియల్ వెబర్‌ను పంపాడని చెప్పారు. ఎంటీవీలో ప్రసారమయ్యే ‘స్ప్లిట్స్‌విల్లా’ ఐదో సీజన్‌కు సన్నీ లియోన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. షోలో భాగంగా మహిళా కంటెస్టెంట్ దేవాంగిని వ్యాస్ తన మాజీ ఫియాన్సీ గురించి మాట్లాడగా.. సన్నీ కూడా తన విషాద ప్రేమ గాథను గర్తుచేసుకున్నారు.
సన్నీ లియోన్ మాట్లాడుతూ… ‘నా భర్త డేనియల్ వెబర్‌ను కలవడానికి ముందు నాకు ఎంగేజ్మెంట్ అయింది. ప్రేమించిన వ్యక్తితోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని నాకనిపించింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని అతడిని నేరుగా ఆడిగేశా. లేదు.. ఇకపై నిన్ను ప్రేమించను అని చెప్ప్పాడు. దాంతో నా మనసు ముక్కలైంది. ఎంతో బాధపడ్డాను’ అని తెలిపారు.
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్‌గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Also Read: Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’!
‘ఇది మా పెళ్లికి రెండు నెలల ముందు ఇదంతా జరిగింది. అప్పటికే మా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. హవాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. ఆ సమయంలో అతడు నా హృదయాన్ని గాయపరిచాడు. ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలా రోజులు ప్రయత్నించాను. ఆ సమయంలోనే దేవుడు నాకోసం డేనియల్ వెబర్‌ను పంపాడు. కష్ట సమయాల్లో అండగా నిలబడ్డాడు. అమ్మా, నాన్న చనిపోయినపుడు నావెంటే ఉన్నాడు. ఎప్పటికీ నా భర్త చేయి వదలను’ అని సన్నీ లియోన్ చెప్పారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోనూ సన్నీ నటిస్తున్నారు. తెలుగులో చివరగా ‘జిన్నా’ సినిమాలో కనిపించారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..