Mallika Sherawat : బోల్డ్ బ్యూటీ ‘మల్లికా షెరావత్’ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. హిందీతో పాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ మల్లికా షెరావత్ నటించి ఇక్కడి జనాలకు దగ్గరైంది. కమల్ హాసన్ హీరోగా నటించిన దశావతారం లాంటి కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మల్లికా షెరావత్ సౌత్ ఇండస్ట్రీలో కూడా సందడి చేసింది. అయితే, 2012 తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి మల్లికా షెరావత్ హఠాత్తుగా కనుమరుగైంది. ఇక తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ అనే సినిమాతో మళ్లీ వెండితెర పైకి రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.
Read Also:Saibaba Daughter Manjira: చనిపోయే ముందు నాన్నతో ఒక బుక్ గురించి చర్చించాము కానీ..
కాగా తాజాగా సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్స్ గురించి మల్లికా షెరావత్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, మల్లికా షెరావత్ ఏం అన్నారు అంటే.. ‘ఒక సౌత్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి హాట్ ఐటెం సాంగ్ ఉందని, చేయాలని అడిగారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్ అనేది అర్థమవ్వాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నేను ఓకే చెప్పాను. ఇంతకీ, నన్ను ఎలా చూపిస్తున్నారు అని అడిగితే… మీ నడుం మీద చపాతీలు వేడి చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకి నేను ఆశ్చర్యపోయి ఆ పాట వెంటనే చేయను అని చెప్పేశాను. వినడానికి మాత్రం ఇది చాలా ఫన్నీగా ఉంది. ఆ తర్వాత మళ్లీ సిట్యూయేషన్స్ ఎదురు కాలేదు’ అని మల్లికా షెరావత్ చెప్పింది. ఇంతకీ, ఆ సౌత్ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పలేదు.
Read Also:Milkshake vs Fruit Juice: మిల్క్ షేక్ లేదా ఫ్రూట్ జ్యూస్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?