NTV Telugu Site icon

Katrina Kaif: వాట్‌ ఏ ఫిల్మ్‌.. విజయ్‌ సినిమాపై కత్రినా కైఫ్‌ పొగడ్తలు!

Katrina Kaif Maharaja

Katrina Kaif Maharaja

Actress Katrina Kaif Heap Praise on Vijay Sethupathi’s Maharaja Movie: తమిళ్ హీరో విజయ్‌ సేతుపతి తన కెరీర్‌లో నటించిన 50వ సినిమా ‘మహారాజ’. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, అభిరామి, దివ్య భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్న మహారాజ సినిమా.. ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. రికార్డు వ్యూస్‌తో రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ మహారాజ సినిమాను బాలీవుడ్‌ హీరోయిన్ కత్రినా కైఫ్‌ వీక్షించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. ‘వాట్‌ ఏ ఫిల్మ్‌. సినిమా చాలా బాగుంది. కథను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ మరియు దర్శకుడు నితిలన్ స్వామినాథన్‌ను ట్యాగ్ చేశారు. విజయ్- కత్రినా ‘మేరీ క్రిస్మస్‌’లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.

 

 

Show comments