NTV Telugu Site icon

Vinod Kumar: కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే..

Boinapally

Boinapally

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే అని అన్నారు. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. జాతీయ విపత్తుల నిర్వహణ యాక్ట్ కింద నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక నిబంధనలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

VS11: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అంటున్న విశ్వక్ సేన్..?

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందని పేర్కొన్నారు. దయచేసి రాజకీయాలు మాట్లాడకుండా ఏం చేద్దామో చెప్పండని బీజేపీని ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదని వినోద్ కుమార్ తెలిపారు. నిన్న రేవంత్ రెడ్డి, ఈరోజు కిషన్ రెడ్డి ఏం మాట్లాడారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

AP News: మాజీ మంత్రి నారాయణ వేధింపుల పర్వం.. పోలీసులను ఆశ్రయించిన ప్రియ

నీళ్ళు, నిప్పును ఎవరు ఎదుర్కోలేరని.. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని వినోద్ కుమార్ అన్నారు. వర్షం, వరద నష్టంపై డిపిఆర్ తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు 2020లో కురిసిన వర్షానికే గ్రేటర్ వరంగల్ లో చాలా నష్టం వాటిల్లిందని.. భద్రకాళి చెరువు నాళా వడ్డెపల్లి చెరువు నాళాను రివర్ ఫ్రంట్ గా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వరంగల్ మహానగరంలో రెండు రివర్ ఫ్రంట్ లను ఏర్పాటు చేస్తామని.. నాళాలపై సంపూర్ణ అవగాహన సీఎం కేసిఆర్ కు ఉందని వినోద్ కుమార్ చెప్పారు.

Show comments