Boiler Explosion: పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boiler Explosion: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సక్తి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగీతరాయ్ ప్రాంతంలో ఉన్న వేదాంత లిమిటెడ్ కు చెందిన పవర్ ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 10 మంది మృతి చెందారు. అలాగే మరో 30 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Gold Income: ఒక్క గ్రాము బంగారంపై రూ.11,221 లాభం.. ఆర్బీఐ కీలక ప్రకటన..
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
అలాగే ఈ ఘటనలో ఇంకా చాలా మంది మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. బాయిలర్ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో దాని శబ్దం దూర ప్రాంతాల వరకూ వినిపించింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడుతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ప్లాంట్‌లో ఆ సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడటంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సక్తి జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమికంగా ఇది సాంకేతిక లోపం లేదా భద్రతా నిబంధనలలో నిర్లక్ష్యం కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Chhattisgarh: Nine people died and 15 injured in a boiler blast at Vedanta Power Plant in Singhi Tarai area of Sakti district. pic.twitter.com/99FpvMmJDo
— Raajeev Chopra (@Raajeev_Chopra) April 14, 2026
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!