Boianapalli Vinod Kumar : పార్టీకి పవర్ లేదు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ

  • మహిళ ప్రజాప్రతినిధులందరికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు
  • ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగిన విషయం తెలిసిందే
Vinod Kumar

Vinod Kumar

మహిళ ప్రజాప్రతినిధులందరికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. నా చిన్నప్పటి నుండి నేను మంత్రులు ఎమ్మెల్యేల క్వాటర్స్ లో ఉండి పెరిగాను, ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయని,  టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చడం పట్ల నా తప్పు కూడా ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ అంశం లేవనెత్తే అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి పవర్ లేదు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో యువకులకు మంచి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ను కోరా అని వినోద్‌ కుమార్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబి జెండా ఎగరవేస్తమని, కేంద్రంలో పులి లా ఉన్న మోడీ పిల్లిలా మారిండన్నారు వినోద్‌ కుమార్‌. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును ఏ నాయకుడు మర్చలేదని ఆయన అన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పార్టీ కోసం నాయకులు పనిచేయాలని, ప్రతిపక్ష పార్టీలు మీదనే ఎక్కువ ఆశలు ప్రజలకు ఉంటాయన్నారు. అన్ని డ్యాములు ఎండిపోయాయని.. నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. పార్టీలో ఉన్నవారిని ఆదుకుంటామని.. యువతకు పెద్దపీట వేస్తామన్నారు. కరీంనగర్ అంటే కేసీఆర్‌కు ఇష్టం, ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు.