Bogus Votes Cast: దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్!

  • రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్
  • నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దొంగ ఓట్లు వేయడానికి ఇద్దరు ప్రయత్నం
  • బూత్ నెంబర్ 24, 78 వద్ద ఇతరుల పేరుతో ఓటు వేసేందుకు యత్నం
  • తప్పుడు గుర్తింపు పత్రాలతో వచ్చిన ఇద్దరు యువకులను అధికారులు గుర్తింపు
  • ఇద్దరిని పోలీసులు అదుపులోకి..
Niz

Niz

Bogus Votes Cast: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకసిపేట గోశాలలో దొంగ ఓట్లు వేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. బూత్ నెంబర్ 24, 78 లలో ఇతరుల పేరుతో ఓటు వేసేందుకు ఇద్దరు యువకులు వచ్చారు. తప్పుడు గుర్తింపు పత్రాలతో పోలింగ్ కేంద్రంలోకి రావడంతో అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు.

SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి!

దీనితో బోధన్ పట్టణం 21వ వార్డు పరిధిలోని అరీసా సాగర్ నగర్ లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకే చోట బీఆర్ఎస్, MIM రెండు పార్టీల కార్యకర్తలు గుమ్మిగూడారు. ఒక్కసారిగా పరస్పర నినాదాలు చేపట్టారు. దాంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకే చోట బిఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తలు గుమిగూడి పరస్పర నినాదాలు చేశారు. దీనితో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

TGSRTC: మహా శివరాత్రికి 2243 ప్రత్యేక బస్సులు.. పకడ్బందీగా ఏర్పాట్లు!